Sunday, September 8, 2024

నీతి అయోగ్ కేటాయించిన లక్ష్యాలను సాధించాలి

- Advertisement -

నీతి అయోగ్ కేటాయించిన లక్ష్యాలను సాధించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి,
మండలానికి నీతి ఆయోగ్ కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మహా ముత్తారం మండలాన్ని నీతి ఆయోగ్ అస్పరేషన్ బ్లాక్ గా ప్రకటించిన నేపథ్యంలో  శుక్రవారం మండలంలో సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం ఉదయ శ్రీ మహిళా సంగం తయారు చేస్తున్న విద్యార్థులు యూనిఫామ్స్ కుట్టు పనులను పరిశీలించారు.  మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.   ఎంపిడివో కార్యాలయం నుండి కేజిబివి పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా కెజిబివి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సంపూర్ణతా అభియాన్ కార్యక్రమంలో ఆయన  మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా  గర్భిణీ స్త్రీలను గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మధుమేహం,  రక్త పరీక్షలు చేయడం,  గర్భిణీ స్త్రీలకు అనుబంధ పోషకాహారం నూరు శాతం అండివిధంగా చర్యలు, భూ పరిరక్షణకు భూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడం,  స్వయం సహాయ సంఘాల మహిళలకు నూరు శాతం రివాల్వింగ్ ఫండ్ మంజూరుతో పాటు అనుబంధంగా కేటాయించిన 49 ఇండికేటర్ల లక్ష్యాలను నూటికి నూటికి నూరు శాతం సాధించాలని ఆయన పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన పేర్కొన్నారు.  అంగన్వాడీ కేంద్రాలను ఎన్నోవేషన్  కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గర్భిణీలకు అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నామని ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక సంఘాలు బలోపేతానికి నూటికి నూరు శాతం రివాల్వింగ్ పండు మంజూరు చేయాలని ఆయన తెలిపారు.  మన జిల్లా మన జిల్లా ఓడిఎఫ్ ప్లస్ కావాలని ఆయన పేర్కొన్నారు.  మహా ముత్తారం మండలంలో ప్రతి ఇంటి నుంచి తడి పొడి వ్యర్దాలు సేకరణ ప్రక్రియ పక్కాగా జరగాలని,  సేకరించిన వ్యర్ధాలను డంపింగ్ యార్డుల్లో వర్మి కంపోస్ట్ చేసి వనమహోత్సవం మొక్కలకు వినియోగించాలని ఆయన సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ ఇతర సౌకర్యాలు కల్పనకు ఇతర మరమ్మతు పనులు  చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.  మన జిల్లాలోని  మహాముత్తారం,  పలిమెల మండలాల సమగ్రాభివృద్ధికి  నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాకులుగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు.  దేశవ్యాప్తంగా 112 జిల్లాలను నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ జిల్లాలుగా గుర్తించగా వాటిలో మన జిల్లా ఒకటని, తిరిగి మళ్ళీ రెండు మండలాలు అభివృద్ధికి యాస్పి రేషనల్ బ్లాకులుగా ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. మారుమూల మండలాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆయన పేర్కొన్నారు. జూలై 4 నుండి సెప్టెంబర్ 30వ తేది వరకు దాదాపు మూడు నెలల పాటు జరుగునున్న ఈ ప్రక్రియలో నీతి ఆయోగ్ కేటాయించిన అన్ని అంశాలను కవర్ చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్, డిపిఓ నారాయణరావు, మహిళా సంక్షేమ అధికారి అవంతిక,  డి ఆర్ డి ఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్  శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్