నేడు బిజెపి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక

- Advertisement -

న్యూఢిల్లీ : డిసెంబర్ 08: ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై కసరత్తు ఇంకా కొనసాగి స్తోంది.

ముఖ్య మంత్రుల పేర్లను ఖరారు చేసేందుకు మూడు రాష్ట్రాలకు పార్టీ పరిశీ లకులను శుక్రవారం నియ మించనున్నట్లు బిజెపి వర్గాలు గురువారం తెలిపాయి.

ముఖ్యమంత్రి అభ్యర్థి త్వాలను ప్రకటించకుండా ఈ ఎన్నికలలో బిజెపి తలపడింది.ఈ మూడు రాష్ట్రాలలో తమ నాయ కుడిని ఎన్నుకునేందుకు కొత్తగాఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు నిర్వహించే సమావేశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారని వర్గాలు తెలిపాయి.

మూడింట రెండు వంతు లకు పైగా మెజారిటీతో గెలుపొందిన మధ్యప్రదేశ్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాజా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పోటీ పడు తున్నారు.

ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular