నేడు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం..

- Advertisement -

నేడు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం..

భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న CM రేవంత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిం చనున్నారు.ఈ పథకం కింద సొంత జాగా ఉన్నవారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం,ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభు త్వం అందించనుంది.ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హు లందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.దశలవారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular