Sunday, September 8, 2024

నేడు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్ 285వ జయంతి

- Advertisement -
Today is the 285th birth anniversary of Sant Sri Sewalal Maharaj

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్కరించుకుని 15 ఫిబ్రవరి 2024 సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి పైగా బంజారా (లంబాడి) ప్రజలు నివసిస్తున్నారు. బంజారా ప్రజలు తమ కుల గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ను ఆరాధ్య దైవంగా కొలుస్తారు.ఈనెల 15న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ను మోతివాళ్ళో , పౌరవాలో అనే పేర్లతో కూడా పిలుస్తారు. సేవాలాల్ మహారాజ్ తన బంజారా సమాజాభివృద్ధికి, చైతన్యానికి కృషిచేసిన అవతార పురుషుడు, బంజారాలు మద్యానికి, మాంసానికి, హింసకు దూరంగా ఉండాలని హితోపదేశం చేశారు. అనేక మహిమలతో తను భగవత్ స్వరూపిడినని నిరూపించుకున్న దైవం మహారాజ్. బంజారా ప్రజలు తమ కుల గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.ఆ రోజు దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ ఆలయాల్లో భోగ్, బండార్, ఖీర్ (పాయసం) తోపాటు మహారాజ్ కు నైవేద్యం సమర్పించి ఉపవాసాలు చేస్తారు. తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, పాడిపంటలు బాగుండాలని కోరుకుంటారు. సేవాలాల్ బోధనలను బంజారాలు నిత్యం పాటిస్తారు. ఇందులో భాగంగా అనేక తండాల్లో బంజారాలు నేటికీ మద్యం,మాంసం మానేశారు. హింసకు దూరంగా ఉంటూ సన్మార్గంలో పయనిస్తున్నారు. అనేక మంది బంజారా యువతి,యువకులు సేవాలాల్ మహారాజ్ దీక్షను చేపడుతున్నారు. ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయాలు ఉన్నాయి.

బంజారాలకు దశ-దిశ చూపి, వారి ఆచార వ్యవహారాల గొప్పదనం, విశిష్టతలను తెలియజేయడానికే సేవాలాల్ మహరాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని రాంజీ నాయక్ తండాలో జన్మించారు. తండ్రి భీమనాయక్ తల్లి ధర్మిణిబాయి. పెరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులను కాస్తూ అడవిలో దొరికే బంకమట్టితో రొట్టెలు చేసి తినేవారు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులకు మరియు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ హింస పాపమని, మత్తు-దుమపానం శాపమని, ఎప్పుడు సత్యమే పలకాలని తన తెల్లటి గుర్రం తోళారాంపై తిరుగుతూ ప్రబోధించేవారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలిని, దాహంతో ఉన్నవాడికి మంచి నీళ్ళు తాగించాలని, దారి తప్పిపోయి ఆగమవుతున్న వారికి మంచి మార్గం చూపించాలని, సహాయం కోరిన వారికి అండగా ఉండాలని, ఏడుస్తూ కూర్చుంటే ఉన్నతులు కాలేరని ఎన్నో జీవిత సత్యాలను తెలియచేశారు.

అలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాలు పోతులూరి వీరబ్రహ్మమ్ కాలజ్ఞానం లాగా క్షణంలోనే మన మాటలు ఏ ఖండాంతరాలకైన చేరిపోతాయిని, నీళ్ళను సహితం డబ్బులతో కొనాల్సిన రోజు వస్తుందని, ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయిని నేడు మన అనుభవంలో ఉన్న సెల్‌ఫోన్, నీళ్ళ పరిస్థితిని, వాహానాలను గురించి ఆనాడే చెప్పారు. సేవాలాల్ మహిమలపైన అనేక కథనాలు కలవు. దేశంలో బంజారాల జనాభా సుమారు పది కోట్లు. వీరి ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ మహారాజ్ జీవితం బంజారాలకే కాక యావత్ సమాజానికి ఆదర్శప్రాయం. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. దేశమంతా జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి ఘనంగా జయంతోత్సవాలు నిర్వహించాలి.

మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అహరహమూ శ్రమించారు. తనదైన శైలి బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. ప్రకృతిని, వన్యజీవులను కాపాడుకుంటూ.. తల్లిదండ్రులు, మహిళలను గౌరవిస్తూ జీవించాలన్నది ఆయన ప్రవచనాల్లో అత్యంత కీలకమైనది.

గిద్:
కర్ లరే భాయా భక్తి మారి…

కరు కపనేరి కాయా తారి!

ఆన్ థనేరి భరు కోటడి!

చో మినార్ అంగేర్ వాత్ కియు!

రణవేర్ తో జీతన్ లాయు!

ఢిల్లీ ఆగ్రామా నామ్ చలాయు!

మారి భక్తి కర్లరే సేవాభాయా!

భావం: ఓ సేవాలాల్ నాకు పూజలు చేయి!నేను సకల సంపద ఇస్తాను. ఆరు నెలల ముందే జరిగే విషయాలు చెబుతాను. యుద్ధంలో విజయం వరింప చేస్తాను. ఢిల్లీ ఆగ్రా వరకు నీ పేరు మారుమోగేల చేస్తాను. ఇకనైనా నా భక్తి చేసుకో సేవా భాయా.అప్పుడు సేవాలాల్ దేవి మాటలకు సంతృప్తి చేంది భక్తుడిగా మారడానికి ఒప్పుకున్నాడు. దీంతో జగదాంబా దేవి తన అద్భుత విశ్వరూపంతో దర్శనమిస్తుంది. విశ్వం మొత్తం తన శరీరంలో చూపిస్తుంది. అప్పటి నుండీ దేవిమాతను భక్తి ప్రపత్తులతో కొలిచి దేవికి అత్యంత ప్రీతి పాత్రమైన భక్తుడయ్యడు. నా జగదాంబా దేవిని వేడుకున్నాడు. దానికి దేవి మాతా సరేనంటూ వరమిచ్చింది.

సేవాలాల్ మహరాజ్ దేవి పూజలు చేస్తూ బంజారా జాతి సన్మార్గంలో నడిచేవిధంగా బోధనలు చేస్తూ చైతన్యం తీసుకొచ్చారు. తన మహిమతో వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చారు. ఆపదలో ఉన్నవారు తన నామాన్ని స్మరిస్తే చాలు వారి సమస్యకు పరిష్కరించి దేవుడుయ్యడు చివరికి అదిమాయ శక్తి మహిమలతో మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని రుయిఘడ్ లో స్వర్గస్థూలైనారు. మహరాజ్ ప్రార్థివ దేహం ఉన్న శివపేటిక గాలిలో ఎగురుతూ పౌరఘడ్ లో ఆగింది.

👉అక్కడే మహరాజ్ అంతక్రియలు జరిపి మహాసమాధి నిర్మించారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా లక్షలాది బంజారా భక్తులు పౌరఘడ్ లోని సమదిని సందర్శించి మహారాజ్ ను స్మరించుకుంటారు. నిత్యం సందర్శకులతో పౌరఘడ్ కిటకిటలాడుతోంది.

బంజారాల దేవుడు
బంజారాల హక్కులు, నిజామ్, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్‌ సేవాలాల్‌ కీలక భూమిక పోషించారు. ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు లోను కాకుండా, ఇతర సంప్రదాయాల్లోకి బంజారాలు మారకుండా సేవాలాల్‌ ఎంతగానో కృషి చేశారు. తద్వారా బంజారాలకు ఆయన ఆరాధ్య దైవమయ్యాడు. లిపిలేని బంజారాల భాషకు ఒక రీతిని సమకూర్చింది కూడా సేవాలాల్‌ మహారాజే. కోట్లాదిగా బంజారాలు… స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచారవ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో బంజారాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ..ప్రపంచవ్యాప్తంగా ఒకేరకమైన భాషను మాట్లాడగలుగుతున్నారంటే అది సంత్‌ సేవాలాల్‌ కృషి ఫలితమే.

మహిమలు

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ మహిమలు అద్భుతమైనవి. వీటి మీద అనేక కథనాలు కలవు. వాటిలో పురుషున్ని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీయం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం. సేవాలాల్‌కు అపకీర్తి తీసుకురావాలని జాదూగర్‌ వడితియా ఒక పురుసుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్‌ తథాస్తు అంటూ దీవిస్తాడు. నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు. అలాగే సేవాలాల్‌ దర్బారులోనికి తలవంచి ప్రవేశించడానికి అతడి ప్రవేశ మార్గంలో చిన్న తలుపును ఏర్పాటు చేయగా సేవాలాల్‌ తన ఆకారాన్ని కుదించుకుని తలవంచకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు. అలాగే సేవాలాల్‌ను బావిలో దిగి సన్నని నూలు పోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు.

రెండు జెండాల ఆంతర్యం

బంజారాల్లో అత్యధికులు సప్త మాతృకల పూజావిధిని అనుసరిస్తారు. వీరు సేవాలాల్‌ ఆరాధ్యదైవం జగదంబతోపాటు, సేవాలాల్‌ విగ్రహానికీ పూజలు చేస్తారు. ఆలయం ముంగిట్లో రెండు జెండాలుంటాయి. ఒకటి తెల్లది.. మరోటి ఎరుపు వర్ణంలోనిది. తెలుపు వర్ణం సేవాలాల్‌కు శాకాహారాన్ని నివేదించమని,ఎరుపు వర్ణం జగదంబకు మాంసాహారాన్ని నివేదించమని సూచిస్తాయని బంజారాలు నమ్ముతారు. నిజానికి సేవాలాల్‌ విగ్రహారాధన, మూఢనమ్మకాలు, జంతుబలులకు వ్యతిరేకి కావడం విశేషం.

బంకమట్టితో రొట్టెలు

ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టాలనేది సంత్‌ సేవాలాల్‌ కీలకమైన ప్రబోధం. చిన్నతనంలో పశువులను కాసేందుకు వెళ్లిన సేవాలాల్, తన తల్లి కట్టి ఇచ్చిన ఆహారాన్ని ఇతరులకు పంచి, తాను అక్కడున్న బంకమట్టితో రొట్టెలు చేసుకుని తినేవాడని బంజారాలు నమ్ముతారు. అందుకే.. దీనికి గుర్తుగా, కొందరు బంజారాలు ఇప్పటికీ బంకమట్టితో చేసిన పదార్థం సిరాను సేవాలాల్‌కు నివేదిస్తుంటారు. జంతుబలిని సేవాలాల్‌ బలంగా వ్యతిరేకించేవాడు. ఈ క్రమంలో జగదంబ కరుణకు పాత్రుడై.. మానవుల్లో పెరుగుతున్న అహింస, దురలవాట్లకు వ్యతిరేకంగా బంజారాలను నడిపించాడు.

బంజారాలా సేవా పోలీస్‌

అస్పృశ్యత, వివక్షతలకు దూరంగా హూందాగా జీవించడం, భయాందోళనలకు గురికాకుండా ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో జీవించాలి, నిరుపేదలు, ఆకొన్నవారికి ఆహారాన్ని సమకూర్చాలి. అనైతిక విలువలు, అనైతిక సంబంధాలకు దూరంగా ఉండాలి.. ఇలాంటి సుమారు 22 కీలకమైన సేవాలాల్‌ ప్రవచనాలను బంజారాలు సేవా పోలీస్‌ గా పిలుచుకుంటారు

బంజారా జీవితానికి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 22 ప్రధాన ప్రవచనాలు/ భావిస్ బోలి అందించారు:👇

1. అటవీ మరియు పర్యావరణాన్ని రక్షించండి

2. సహజ జీవితాన్ని గడపండి మరియు ప్రకృతితో అనుసంధానించబడి ఉండండి

3. ఏ ప్రాతిపదికన ఎవరినీ వివక్ష చూపవద్దు

4. గౌరవప్రదమైన జీవితాన్ని గడపండి

5. నిజాయితీగా ఉండండి (సత్ బోలి), మరియు దొంగిలించవద్దు

6. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి మరియు ఇతరులకు హాని చేయవద్దు

7. స్త్రీలను గౌరవించండి మరియు బాలికలు సజీవ దేవతలు

8. చింతించకండి మరియు నిర్భయంగా జీవించండి, ధైర్యంగా మరియు జీవితంలో నమ్మకంగా ఉండండి

9. అత్యాశ పడకూడదు మరియు ఇంద్రియ సుఖాలను కోరుకోవద్దు

10. నీటిని రక్షించండి, దాహంతో ఉన్నవారికి నీటిని అందించండి మరియు నీటిని విక్రయించడంలో ఎప్పుడూ పాల్గొనవద్దు, ఇది అతిపెద్ద నేరం/పాపం

11. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించండి మరియు పేద ప్రజలకు సహాయం చేయండి

12. పెద్దలను గౌరవించండి-చిన్నవారిని ప్రేమించండి మరియు జంతువులను గౌరవించండి

13. అడవులను సంరక్షించండి మరియు అడవులలో సాధారణ జీవితాన్ని గడపండి

14. విషపూరితమైన పదార్ధాలను తినవద్దు మరియు ఆల్కహాల్ లేదా ఏదైనా మత్తును పూర్తిగా నివారించండి

15. అక్రమ సంబంధం పెట్టుకోవద్దు

16. అంతర్గత శాంతిని కలిగి ఉండటానికి ధ్యానం చేయండి మరియు అధ్యయనం చేయండి, జ్ఞానాన్ని వెతకండి మరియు జ్ఞానాన్ని పొందండి

17. ఆధునిక జీవనశైలి మరియు సౌకర్యాల ద్వారా ఆకర్షించబడకండి మరియు శారీరక శ్రమలో తప్పనిసరిగా పాల్గొనండి

18. మానవత్వంపై ప్రేమను కలిగి ఉండండి మరియు కేవలం డబ్బు కోసం వెతకకండి, మీ తోటి కమ్యూనిటీ వ్యక్తుల కోసం సాంగత్యం కలిగి ఉండండి.

19. సహేతుకమైన జీవితాన్ని కలిగి ఉండండి మరియు అన్ని మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి

20. మీ తల్లిదండ్రులను గౌరవించండి,మీ కుటుంబాన్ని,సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు సంఘంలో సోదరభావాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయకండి

21. కమ్యూనిటీ యొక్క సంస్కృతి మరియు భాషను రక్షించండి, గోర్ భాసా/గోర్బోలి మాట్లాడండి మరియు ప్రకృతితో అనుసంధానించబడిన అన్ని సమాజ పండుగలను కూడా జరుపుకోండి మరియు ప్రకృతికి హాని కలిగించే పండుగలను నివారించండి

22. కమ్యూనిటీ నిబంధనలను అనుసరించాలి మరియు గోర్/బంజారా యొక్క గుర్తింపును కొనసాగించాలి, ప్రకృతితో అనుసంధానించబడి ఉండాలి మరియు దానిని దోపిడీ చేయకూడదు.

ఆధ్యాత్మిక ,క్షాత్ర తేజం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

భారదేశ చరిత్రలో 18వ శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. గొప్పగొప్ప రాజులు అంతరించారు. మరఠాలు శక్తివంతులవుతున్నారు. మరోవైపు బ్రిటిష్ వారు (ఈస్ట్ ఇండియా కంపెనీ) భారత్ ను తమ అధీనంలోకి తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. మిషనరీలు క్రైస్తవ మతప్రచారం ముమ్మరం చేశారు. ఈ మూడు శక్తుల పోరాటం నడుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో సేవాలాల్ మహారాజ్ అవతరించారు. క్రైస్తవీకరణ సాగుతున్న సమయంలో బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించారు. భక్తి యుగంలో జన్మించిన మహాత్ములలాగా భక్తిని ప్రేరేపించారు. భక్తి ఆయుధంగా సంస్కరణ చేశారు. సమాజాన్ని సంఘటితం చేశారు. రాబోయే పరిణామాలను ముందుగా పసిగట్టారు. ఆ మహాత్ముని జీవిత చరిత్ర అందరూ చదవాలి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి.

👉ఒకప్పుడు హైదరాబాద్ లో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఉన్న బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు ఆయన మహిమను గుర్తించిన రాజు సేవాలాల్ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మించాడని చరిత్ర తెలుపుతోంది.

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంత సంచరిస్తూ బంజారాలకు హితబోధ చేసిన మహోన్నతమైన వ్యక్తి ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్’. యావత్ భారత దేశం అంతా సంచరిస్తూ ఉప్పు అమ్ముకుంటూ, ఆవులను మేపుకుంటూ దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ మహారాజ్ ఏకం చేశారు. స్థిరనివాసం ఆవశ్యకతను తెలిపి, బంజారా జాతిని మూఢనమ్మకాల నుండి హింసా, మద్యపానం మొదలగు వ్యసనాలకు బానిసకాకుండా స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని బంజారాల గురువు ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్’ హితోపదేశం చేశారు. దేశవ్యాప్తంగా జయంతిని బంజారాలు ఒక పండుగలా జరుపుకుంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్