నేడు చిన్న హనుమాన్ జయంతి
Today is the birthday of little Hanuman.
కొడిమ్యాల,
రుద్రుడి అంశతో జన్మించిన హనుమంతుడు రావణుడిని నిర్మూలించి భూమిపై ధర్మాన్ని స్థాపించాలనే తపనతో రాముడికి (విష్ణువు అవతారం) సేవ చేయడానికి మరియు సహాయం చేయడానికి జన్మించాడు. హనుమంతుడు రామునికి అత్యున్నత భక్తుడు.
ఈ హనుమాన్ జయంతి సందర్భంగా గురించి హనుమాన్ జయంతి గురించి మనం తెలుసుకోవాలి..రామాయణం లో సుందరాకాండ లో వివరించిన ప్రకారం.. రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేసి, రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది.నిజానికి హనుమజ్జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం శనివారమే అసలైన హనుమజ్జయంతి. హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ రోజే అసలైన హనుమంతుని జయంతి. ఇక మనం హనుమంతుని నుండి స్వీకరించాల్సినవి..హనుమంతుడు తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడు..హనుమంతుడు వాయు కుమారుడు, అది గాలి.. మరియు అతను ఐదు ఇంద్రియాలను సూచిస్తాడు – అవి వాసన, రుచి, దృష్టి, స్పర్శ మరియు వినికిడి. హనుమంతుడు విశ్వంలోని ఐదు ప్రాథమిక అంశాలను సూచించే ఐదు ఇంద్రియాలను – భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు గాలి – పైన నియంత్రణ చూపే ప్రావీణ్యం సంపాదించాడు..ప్రతీ ఒక్కరు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే..గొప్ప కార్యాల్ని సైతం అవలీలగా సాధించవచ్చు అని తెలుసుకోవచ్చు.