నేటి పెట్రోల్,డీజిల్ ధరలివే..మీ నగరంలో లీటర్ ఎంతంటే..?
పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఆదివారం అంటే ఏప్రిల్ 7వ తేదీకి సంబంధించిన తాజా ఇంధన ధరలను విడుదల చేశాయి. ఒకవేళ మీరు కూడా ఏదైనా పని మీద ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే..కారులో ఇంధనం నింపే ముందు ధరలను తనిఖీ చేయడం మంచిది. అదే సమయంలో ప్రతి నగరంలో రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ పన్ను కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. కాగా, ఇప్పుడు ఢిల్లీ నుండి చెన్నై వరకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72 గా, డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.21గా, డీజిల్ ధర రూ.92.15గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.103.94గా, డీజిల్ ధర రూ.90.76గా ఉంది. చివరికి చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75గా, డీజిల్ ధర రూ.92.34గా ఉంది.
ఇతర నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు
నోయిడాలో లీటరు పెట్రోలు పై రూ.94.83 గా, డీజిల్ పై రూ.87.96 గా ఉంది. గురుగ్రామ్ లో లీటరు పెట్రోలు పై రూ.95.19గా, డీజిల్ రూ.88.05గా ఉంది. బెంగళూరు నగరంలో లీటర్ పెట్రోల్ రూ.99.84 గా, డీజిల్ రూ.85.93 గా ఉంది. చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.94.24 గా, డీజిల్ రూ.82.40 గా ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.41 గా, డీజిల్ రూ.95.65 గా ఉంది. జైపూర్ లో లీటరు పెట్రోలు పై రూ.104.88 గా, డీజిల్ రూ.90.36 గా ఉంది. పాట్నా లో లీటరు పెట్రోలు రూ.105.18 గా, డీజిల్ రూ.92.04 గా ఉంది
ఇక లక్నో లో లీటర్ పెట్రోల్ పై రూ.94.65, డీజిల్ పై రూ.87.76 ఉంది.



