చీటీల పేరుతో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి టోకరా,
చీటీల డబ్బులతో పరారీ
Tokara, a retired railway employee in the name of Chittila,
గుత్తి
అనంతపురం జిల్లా, గుత్తి ఆర్ఎస్ లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చిటీల పేరుతో టోకరా వేశాడు. – సుమారు కోటి రూపాయలతో పరారయ్యాడు. గుత్తి ఆర్ ఎస్ బండిమోటు వీధిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అత్తరు హుస్సేన్ నివాసం ఉంటున్నాడు. ప్రతి నెల ప్రైవేట్ చీటీలు వేస్తుంటాడు. చీటీలు పాడుకున్నాక నగదు ఇవ్వకుండా ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు. – చీటీలు వేసిన బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు. సుమారు 40 మంది బాధితులు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వద్ద చీటీలు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ అవసరాల కోసం చీటీలు వేస్తే చీటీ డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని బాధితులు కన్నీరు అయ్యారు. నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.