- Advertisement -
బడ్జెట్ లో టాప్ 10 అంశాలు
Top 10 Items in Budget
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌పై చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రజలు. వారి అంచనాలకు మించి అన్నట్టు నిర్మలా సీతారామన్ కూడా వరాలు ప్రకటించారు. గంటా 24 నిమిషాల ప్రసంగాన్ని మీరు సింపుల్‌గా పది పాయింట్లలో చదివేయండి
1. 12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు
ఈసారి బడ్జెట్‌లో ప్రధానమైన కీలకమైన అంశం ఇదే. 12లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది కేంద్రం. ఇది మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటనే చెప్పాలి. ఈ ఏడాది వరకూ 7లక్షల రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే దాన్ని దాదాపుగా డబుల్ చేస్తూ 12 లక్షల మినహాయింపు ఇవ్వటం ఎవ్వరూ ఊహించనది. స్టాండర్డ్ డిడక్షన్ 75వేల రూపాయలు ప్రకటించగా…కొత్త ప్రకటనతో 12 లక్షల 75వేల రూపాయల వరకూ ఆదాయం కలిగిన వారు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు.
2. MSMEలకు బడ్జెట్‌లో వరాలు
సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించింది. MSMEలు ఏర్పాటు చేసుకోవటానికి కేంద్రం ఇచ్చే రుణాలను రూ.5కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పెంచింది కేంద్రం. MSMEలు ఏర్పాటు చేసుకునే వాళ్లకు చేయూతనిచ్చేలా ఈ నిర్ణయాన్ని బడ్జెట్ లో ప్రకటించారు.
3. స్టార్టప్‌లకు బడ్జెట్ ఊతం
ఇప్పటివరకూ అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్‌లు పెట్టుకుందాం అనుకునే వాళ్లు సరైన పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్లు. కానీ ఈసారి బడ్జెట్‌లో స్టార్టప్‌లపై కేంద్రం బాగా దృష్టి పెట్టింది. మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉంటే చాలు కేంద్రం మీకు 20కోట్ల రూపాయల వరకూ రుణాలు ఇవ్వనుంది. ఇంతకు ముందు వరకూ 10కోట్ల రూపాయల వరకూ ఉండేది.
4. క్రెడిట్ కార్డుల జాతర
ప్రభుత్వం పట్టణ పేదలకు క్రెడిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వార్షిక బడ్జెట్‌లో ప్రకటన చేశారు. 30వేల రూపాయల లిమిట్‌తో పట్టణ పేదలకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను ఇస్తామని ప్రకటించారు బడ్జెట్‌లో రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచారు. ఇంతకు ముందు వరకూ రూ.3 లక్షల రూపాయలుగా ఉన్న రుణాల పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు బడ్జెట్ లో ప్రకటన చేసింది.
5. అణు శక్తి భారత్
ఈసారి బడ్జెట్‌లో భారత్ అణుశక్తి మీద బాగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు ఉన్నాయి అణుశక్తి మీద. రూ.20 వేల కోట్ల రూపాయలతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. 2030 నాటికి నాలుగు చిన్న, మధ్య తరహా స్థాయి అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం… 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా భావిస్తున్నామని చెప్పింది.
6. విద్యకు ఊతం
5 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అదనంగా 6,500 సీట్లు క్రియేట్ చేయబోతున్నట్టు వెల్లడించారు. IIT పాట్నాను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇంటర్‌నెట్ కనెక్టివిటీని అందిస్తారు. పాఠశాలలు, ఉన్నత విద్య కోసం భారతీయ భాషా పుస్తకాల డిజిటల్ రూపాన్ని అందించేందుకు ‘భారతీయ భాషా పుష్తక్’ పథకాన్ని ప్రారంభించనున్నారు.
7. AIలో ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్సలెన్స్ సెంటర్‌ను 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
8. గిగ్ వర్కర్స్ కోసం భారీ ప్రకటన
రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో సీట్ల సంఖ్య 75,000కు పెంచబోతున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పనిచేస్తున్న గిగ్ వర్కర్లను ఇ-శ్రమ్ పోర్టల్‌లో చేర్చనున్నారు. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సౌకర్యాలు కల్పిస్తారు. దాదాపు 1 కోటి మంది గిగ్ వర్కర్లు లబ్ది పొందనున్నారు. అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో క్యాన్సర్ సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు.
9. యూరియా సంక్షోభానికి తెర
అసోంలోని నామ్‌రూప్‌లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈశాన్య ప్రాంతంలో మూతపడిన మూడు యూరియా ప్లాంట్లు పునఃప్రారంభించనున్నారు. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా అడుగువేయనున్నారు.
10. రైతులకు పండగ
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది. 100 జిల్లాలు ధన్ ధాన్య యోజనకు అనుసంధానించనున్నారు. పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలో భాంగగా బఠానీ, ఉసిరి, కందులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ధన్ ధాన్య యోజన కింద నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ రైతుల నుంచి పప్పులను కొనుగోలు చేస్తారు
- Advertisement -