Sunday, September 8, 2024

కాటిప‌ల్లికి టాప్ ప్ర‌యారిటీ

- Advertisement -
Top priority for Katipalli

కాటిప‌ల్లికి టాప్ ప్ర‌యారిటీ
నిజామాబాద్, జనవరి  26,
కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఉద్దండులను ఓడించి జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందిన ఆ కాషాయ నేతకు బీజేపీ అగ్ర నాయకత్వం కీలక బాధ్యత అప్పగించాలనే ఆలోచన చేస్తోందా..? పార్టీ కోసం ఆయన సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుందా..? ఇప్పటికే రెండు కీలక బాధ్యతలు అప్పగించిన కాషాయ పార్టీ.. ఆ ఇద్దరిని ఓడించిన సదరు నేతకు ఎలాంటి గిప్ట్ రెడీ చేసిందన్నది ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి త్వరలో గోల్డెన్ ఛాన్స్ దక్కనుందట. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సదరు ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తోందట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను ఓడించిన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రమణారెడ్డి. అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టినా.. ఆయన విజయం దేశం దృష్టిని ఆకర్షించిందట. ఆయన విజయం కాషాయ పార్టీ పెద్దల మనస్సు దోచిందట. దీంతో ఆయన సేవలను పార్టీకోసం విస్తృతంగా వాడుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించారట జాతీయ నేతలు. దీంతో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం.. రమణారెడ్డిని జహీరాబాద్ ఎన్నికల ఇంచార్జీగా నియమించారు. అయోధ్య శ్రీ రామ తీర్ధ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ గా ఆయనకు అవకాశం కల్పించారు కూడా. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న రమణారెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు చుట్టి రావడంతో పాటు.. అయోధ్య తీర్ధ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారట. ఇలా పార్టీలో కీలత బాధ్యతలు నిర్వహిస్తున్నారట రమణారెడ్డి. ఐతే ఆయనకు మరో గిప్ట్ సైతం రెడీ చేసిందట బీజేపీ అగ్రనాయకత్వం..కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన రమణారెడ్డికి.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తోందట. ఇద్దరు ఉద్దండులను ఓడించినందుకు గిప్ట్ రెడీ చేసిందట. ఇప్పటికే జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ఇంచార్జీగా.. అయోధ్య శ్రీరామ తీర్ధ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ ఉన్న కీలక బాధ్యతలు అప్పగించిన కాషాయ పార్టీ.. త్వరలో బీజేపీ శాసన సభా పక్ష నాయకునిగా నియమించాలనే ఆలోచన చేస్తోందట. ఇటీవల శాసన సభా పక్ష నేత ఎంపిక పై జాతీయ నాయకులు చర్చించినప్పుడు.. రమణారెడ్డి పేరు ప్రస్దావనకు వచ్చిందట. గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేసిన అనుభవం, ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై చేసిన పోరాటం అసెంబ్లీలో పనిచేస్తుందనే అభిప్రాయం జాతీయ నేతల్లో వ్యక్తం అయ్యిందట. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా నియమించి పార్టీ అగ్రనేతలు.. రమణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల గిప్ట్ ఇస్తారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా. ఒకరిద్దరు మినహా మెజార్టీ ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచిన వారే ఉన్నారట. శాసన సభా పక్ష నేత రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డితో పాటు రమణారెడ్డి ముందు వరుసలో ఉన్నారట. ఐతే జాయింట్ కిల్లర్ కు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోందట.రమణారెడ్డికి కొందరు రాష్ట్ర నేతలు సైతం మద్దతుగా నిలుస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం నసేమిరా అంటున్నారట. ఐతే జాతీయ నాయకత్వం తొలిసారి గెలిచిన రమణారెడ్డికి ఫ్లోర్ లీడర్ ఛాన్స్ ఇస్తుందా.. సీనియర్ కు అవకాశం కల్పిస్తుందా అన్నది ఉత్కంఠగా మారిందట. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారట ఆయన అనుచరులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్