- Advertisement -
నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల
Tourism policy released in Novemberవిశాఖపట్నం
రాష్ట్ర పర్యాటక రంగా న్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల చేస్తా మని, ఏప్రిల్ 2025 నుండి పాలసీ అమల్లోకి రానుందని మంత్రి కం దుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖ సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాల సీకి సంబంధించి పలు అంశాలు వివరించారు. పర్యాటకులను ఆక ర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలం గా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక సహకారం అందించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందుకు వచ్చార ని తెలిపారు. సెప్టెంబర్ 2న బెంగు ళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వైజాగ్ లో జరగాల్సిన సమావేశం భారీ వర్షాలు, వరదల వల్ల బెంగు ళూరులో జరిగిందని పేర్కొన్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి అవస రమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాను వెల్లడించానని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ ద్వారా టెంపుల్ టూరిజాన్ని, స్వదే శీ దర్శన్ ద్వారా ఎకో, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయను న్నామని వెల్లడించారు.
- Advertisement -




