ట్రాఫిక్ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రదాన పాత్ర పోషించాలి..!
రామగుండం. సిపి..
పెద్దపల్లి జిల్లా: జనవరి. 16 (వాయిస్ టుడే) గోదావరిఖని:
Traffic rules Government employees should play a leading role..!
Ramagundam. CP..
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. “ఎరైవ్ ఎలైవ్ క్యాంపెయిన్ “ లో భాగంగా గోదావరి ఖని పోలీస్ ఆద్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక భాద్యతగా భావించి రోడ్డుప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నిబంధనల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. తమ భద్రత , రక్షణ పట్ల స్వంత ఆలోచనను సమాజంలో గౌరవ స్థానo లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వివరిస్తే ప్రయోజనం ఉంటుందని అన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ అధికారుల సమన్వయంతో నగర పాలక సంస్థ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు అందరూ కలిసి సమష్టిగా కృషి చేయాలని అన్నారు.
అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు వెడల్పు తో పాటు అనేక కార్యక్రమాలు నగర పాలక సంస్థ చేపడుతున్నదని అన్నారు. జిల్లా కేంద్రంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలు తరచుగా నిర్వహిస్తూ వారి సూచనలను కూడా అమలు చేస్తున్నామని అన్నారు. రోడ్డు భద్రత గురించి పోలీస్ అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు నగర పాలక సంస్థ తీసుకుంటుందని అన్నారు. టైమ్ మేనేజ్ మెంట్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు కొంత వరకు నివారించగలమని అన్నారు. ఈ మేరకు నగర పాలక సంస్థ సిబ్బందికి అవగాహన కూడా కల్పిస్తున్నామని అన్నారు. పెద్దపల్లి డి సి పి . రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రచార కార్యక్రమo “ఎరైవ్ ఎలైవ్ క్యాంపెయిన్” ఉద్దేశ్యాన్ని అలాగే రోడ్డు ప్రమాద కుటుంబాల బాధితుల కష్టాలను వివరించారు. ట్రాఫిక్ ఎ సి పి . సి హెచ్ . శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వాహనం పై వెళుతున్నప్పుడు హెల్మెట్ ధరించి ఉండాలని అన్నారు. త్రాగి వాహనం నడపవద్దని అన్నారు . పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ట్రాఫిక్ సి ఐ ప్రవీణ్ మాట్లాడుతూ సత్వరంగా స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం నుండి నగదు పురస్కారం , బాధితుడికి ఒక లక్షా యాభయ్ వేల రూపాయల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎ సి పి గజ్జి కృష్ణ , ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి ఆర్ ఎం ఓ కృపా భాయ్ , గోదావరిఖని వన్ టౌన్ సి ఐ . ఇంద్రసేనా రెడ్డి , ట్రాన్స్ పోర్ట్ విభాగo అధికారి లింగయ్య , ఆర్ & బి , ఆర్ టి సి , మున్సిపల్ తదితర ప్రభుత్వ సంస్థల అధికారులు , సిబ్బంది, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


