Wednesday, January 21, 2026

వేములవాడ నియోజకవర్గంలో విషాదం.. లండన్ లో యువకుడు మృతి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -

వేములవాడ నియోజకవర్గంలో విషాదం.. లండన్ లో యువకుడు మృతి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి

వాయిస్ టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్టోబర్ 4

Tragedy in Vemulawada constituency.. young man dies in London, government whip Aadi Srinivas is deeply shocked

రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ నియోజకవర్గంలో ని మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రమేష్ రెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి లండన్ లో శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విషాద వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే మహేందర్ రెడ్డి ఉన్నత విద్య కోసం గత కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్లి విద్య ను అభ్యసిస్తున్నాడు. ఉన్నట్టుండి మహేందర్ రెడ్డికి చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలీ గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మహేందర్ రెడ్డి మృతి చెందడంపై స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మహేందర్ రెడ్డి చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని, ఆ భగవంతుడు మహేందర్ రెడ్డి అమ్మానాన్నలకు మనోధైర్యాన్ని కల్పించాలని వేడుకున్నారు. అయితే మహేందర్ రెడ్డి డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించేందుకు ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దింతో మహేందర్ రెడ్డి స్వగ్రామం దమ్మన్నపేట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్