Sunday, September 8, 2024

పారిశ్రామికవేత్తలుగా గిరిజనులు

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 2, (వాయిస్ టుడే  ): గిరిజనులు పారిశ్రామికంగా ఎదగాల్సి ఉందనిమంత్రి కేటీఆర్ అన్నారు.  ఎస్టీ ఆంథ్రప్రెన్యూర్స్‌ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ మీట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. గిరిజనులు   చాలా ఎత్తుకు ఎదగాలని కలలు కనాలని, అలాంటివారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్దిదారులు రైస్‌ మిల్‌ పెట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా వాటర్‌వర్క్స్‌లో దళితబంధు కింద 150 వాహనాలు ఇచ్చామని వెల్లడిచారు. ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసేవాళ్లకు పోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్‌ మీట్‌ జరుపుకుందాని చెప్పారు.ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్‌  జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కంపెనీలో కాంట్రాక్టులు చేశారని  అన్నారు.

Tribals as entrepreneurs
Tribals as entrepreneurs

తర్వాత రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్‌ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. తెలంగాణ చరిత్రనే మార్చేసిన నాయకుడిగా ఎదిగారన్నారు. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే వరకూ తనకు గురించి పెద్దగా తెలియదన్నారు.  వ్యాపారంలో పోటీ ఉండాలని అలాంటప్పుడే విజయాలు సాధించగలుగుతామన్నారు.

వ్యాపారంలో విజయం సాధించినవారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈరోజు స్టార్టప్ లుగా మొదలైనవారు రేపు రాబోయేవారికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారులకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది అంటూ ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ వల్లే ఎస్టీ  పారిశ్రామిక వేత్తలు తయారవుతున్నారని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి కేసీఆర్‌ అన్నివిధాలు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో అనే పార్టీలు, ప్రభుత్వాలను చూశామని గిరజనులను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో గిరుజనులు అభివృద్ధి చెందారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్