Sunday, September 8, 2024

తెలుగు వారి మనసుల మీద ఎక్కుపెట్టిన సమ్మోహనాస్త్రం – త్రివిక్రమ్

- Advertisement -

తెలుగు వారి మనసుల మీద ఎక్కుపెట్టిన సమ్మోహనాస్త్రం – త్రివిక్రమ్ :

ఒక భుజం మీద సినిమాసాహిత్యాన్ని, మరో భుజంమీద ఆ సినిమా తాలూకు దర్శకత్వ బాధ్యతల్ని మోస్తున్న త్రివిక్రం గురించి ఎంత చెక్కుపుకున్నన్నా, చర్చించినా తక్కువే అనిపిస్తుంది . ఆయన మాటలు , అవి సినిమా ఫంక్షన్స్ లో కానీ , సినిమాల్లో పాత్రల చేత చెప్పించి డైలాగులు కానీ , అలాగే మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు . హీరోలకు, హీరోయిన్లకు , నటులకు , ఫాన్స్ ఉంటారు . ఎందుకంటే , వాళ్ళందరూ స్క్రీన్ మీద కనిపిస్తారు కాబట్టి . కొంత మంది దర్శకులకు కూడా ఫాన్స్ ఉంటారు – కానీ , త్రివిక్రం అనే రచయిత , దర్శకుడు, తెలుగు నేల నాలుగు చెరగుల్ని దుక్కి దున్ని సినీ దర్శకత్వ సాహిత్య వ్యవసాయం చేస్తున్న స్వాఫ్నికుడు . అందుకే ఆయనకు అంత అభిమాన గణం.

సగం తెరిచిన తలుపులా ఉన్న తెలుగు సినీ సాహిత్యాన్ని , ఒక్క సారిగా కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు – త్రివిక్రమ్ .
నిజానికి తెలుగు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు, త్రివిక్రమ్ ముందు , త్రివిక్రమ్ తర్వాత అని చెప్పాలా? అనే ఆలోచన చేసేటంతగా అయన తెలుగు వాళ్ళ మనసుల్ని ప్రభావితం చేశారు.

అలాగే, హీరోయిన్లు అంటే, పాటలు, రొమాన్స్ కీ తప్ప, ప్రాధాన్యత లేని, తెలుగు సినిమాల్లోకి, కాదనాయకిల రేంజ్ ని పెంచి, స్త్రీల పాత్రల్ని, బలం గా తీర్చి దిద్దారు.

జులాయి లో, మధు కీ, (ఇలియానా ) కు పళ్ళ కీ సెట్ వేసుకుని కనిపించడం, దానికి, బ్రహ్మానందం, ఈ అమ్మాయి ఎవరూ – పళ్ళ కు కంచె వేసుకుంది? అంటాడు.

అదే జల్సా లో, హీరోయిన్ కీ లావు కళ్లద్దాలు పెట్టాడు.
S/O సత్యమూర్తి లో, సమంత షుగర్ పేషెంట్ – షుగర్ లెవెల్స్ పడిపోతుంటాయి.

అలాగే, హీరోయిన్లు అంటే, పాటలు, రొమాన్స్ కీ తప్ప, ప్రాధాన్యత లేని, తెలుగు సినిమాల్లోకి, కాదనాయకిల రేంజ్ ని పెంచి, స్త్రీల పాత్రల్ని, బలం గా తీర్చి దిద్దారు.

జులాయి లో, మధు కీ, (ఇలియానా ) కు పళ్ళ కీ సెట్ వేసుకుని కనిపించడం, దానికి, బ్రహ్మానందం, ఈ అమ్మాయి ఎవరూ – పళ్ళ కు కంచె వేసుకుంది? అంటాడు.

అదే జల్సా లో, హీరోయిన్ కీ లావు కళ్లద్దాలు పెట్టాడు.
S/O సత్యమూర్తి లో, సమంత షుగర్ పేషెంట్ – షుగర్ లెవెల్స్ పడిపోతుంటాయి.

ఈ పైన చెప్పిన అన్ని క్యారెక్టర్స్ లో హీరోయిన్స్ కీ నార్మల్ బలహీనత లున్నా కూడా, హీరోలు లవ్ చేయడం ఆపలేదు. ఎందుకంటే, మానవ బలహీనటాలున్నా ఆడవాళ్లు, ఫీల్ అయి పోవక్కర్లేదు.
ఇదంతా, త్రివిక్రమ్ హీరోయిన్స్ ని చూపించిన విధానం లో, ప్రేక్షకులు గమనించకుండా అందం గా ఆక్సెప్ట్ చేయించాడు.మానవ బలహీనతలున్నా ఆడవాళ్లు, ఫీల్ అయి పోవక్కర్లేదు. ఎవ్వరికైనా హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్, అవ్వి ప్రేమ కీ అడ్డంకి కావు అని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు.

అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో మహిళ పాత్రలు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి.

అరవింద సమేత లో, జేజి (సుప్రియ పాఠక్), బసిరెడ్డి భార్య గా చేసిన సితార, ఈశ్వరి రావు, అరవింద (పూజ హెగ్డే ) లు చాలా ఇండిపెండెంట్ ఆటిట్యూడ్ ఉన్న వనితలు. పాలిచ్చే వాళ్లకు పాలించడం ఎందుకు తెలీదు సార్ – అని ఎన్టీఆర్ క్లైమాక్స్ లో అంటే – ఒక్కసారిగా – నిజమే కదా అనిపిస్తుంది.

అలాగే – అల వైకుంఠ పురం లో – అమూల్య (పూజ హెగ్డే ), యశోద (టబు ) పాత్రలు ప్రాక్టికల్ గా ఉండే విధంగా రాసుకున్న క్యారెక్టర్స్.

జులాయి లో, సవతి తల్లి పాత్రలో, హేమ, ఇలియానా కీ అల్లు అర్జున్ తో పెళ్లి అని తెలిసినప్పుడు, హేమ – నేనొప్పుకోను, “నాకు ముసలోడు నిచ్చి పెళ్లి చేశారు కాబట్టి, దానికి కూడా ముసలోడు నిచ్చి పెళ్లి చేయాలి ” – ఇక్కడ త్రివిక్రమ్ పెన్ను ఎంత సెన్సిటివ్ గా ఆలోచిస్తుందో చెబుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో జన్మించిన అకెళ్ళ నాగ శ్రీనివాస్ @ త్రివిక్రమ్ శ్రీనివాస్- ఆంధ్ర యూనివర్సిటీ లో ఎమ్మెఎస్ఎస్సి నూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మేడలిస్టు. కొంత కాలం లెక్చరర్ గా పనిచేసి, హైదరాబాద్ లో పోసాని కృష్ణ మురళి దగ్గర రైటర్ అసిస్టెంట్ గా చేరాడు. 1999 లో స్వయంవరం సినిమా తో మాటల రచయిత గా మొదలు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్థానం అప్రతిహతం గా సాగుతూ, ఫార్యూన్ ఫోర్ బ్యానర్ మీద తన భార్య సౌజన్య ప్రొడ్యూసర్ గా సితార – నాగ వంశీ తో సినిమా నిర్మాణం లో భాగం అయ్యే స్థాయి కి వచ్చి, తెలుగు వారి గుండెల్లో కొలువుండే స్టేజి కీ వచ్చారు.

త్రివిక్రమ్ సినిమా ల్లో మాటలు తూటాల్లా పెల్తాయి – మన తో ట్రావెల్ చేస్తాయి.
“తెలిసి చేసేది మోసం
తెలీకుండా చేసేది తప్పు”

“మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు ”

“కన్న తల్లీనీ, గుళ్లో దేముడ్ని మనమే వెళ్లి చూడాలి, వాళ్లే మన దగ్గరకు రావాలనుకోవడం తప్పు”.

ఇలాగ – త్రివిక్రమ్ మాటల పదును – వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే.

అయన తో ప్రయాణం లో ఒకసారి స్టార్ట్ చేస్తే, వాళ్లు ఆయన్ని వదల్లేరు – స్నేహానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు.
దానికీ బెస్ట్ ఎగ్జాంపుల్ – సునీల్ – తన ప్రాణ స్నేహితుడు సునీల్ కోసం ఎన్నో పాత్రల్ని సృష్టించాడు- సునీల్ కెరీర్ కీ స్నేహితుడు గా అండ గా ఉన్నాడు – ఉంటున్నాడు.

అలాగే హాసిని హారిక బ్యానర్ మీద ప్రొడ్యూసర్ చిన్న బాబు తో ప్రయాణం ఇంకా సాగుతోంది – ఆయనతో బలపడుతోంది – లేటెస్ట్ గుంటూరు కారం సెట్స్ మీద ఉంది – 2024 సంక్రాతి కీ రిలీజ్ కీ ముస్తాబు అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ ప్రతి ప్రాజెక్ట్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ పరంగా కానీ, మాటల పరం గా కానీ, సెలక్షన్ నుంచి ఇన్వొల్వ్ అయి, తన ప్రియాతి ప్రియమైన స్నేహితునికి సపోర్ట్ గా ఉన్నాడు.

ఇంతటి బహుముఖ విద్వత్తు కలగిన మన మాటల మేజిషియన్ – విలువలకు తోరణాలు కట్టే, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాలంలో సిరా ఇంకా కొత్త పుంతలు తొక్కాలని – ఆయన మస్తీష్కమ్ లోంచి పుట్టిన కథలతో -తెలుగు సినిమా ఇంకా సుసంపన్నం కావాలని కోరుకుంటూ – త్రివిక్రమ్ కీ జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్