కొరడా ఝాళిపిస్తున్న ట్రంప్
Trump is whipping
న్యూయార్క్, ఫిబ్రవరి 4,(వాయిస్ టుడే)
ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాలపై అదనపు సుంకాల కొరడాను ఝళిపిస్తున్నారు. అధికారంలోకి వస్తే అక్రమ వలసలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా అడ్డుకుంటానని చెప్పినట్టుగానే.. ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కెనడా, మెక్సికో దేశాల నుంచి చేసుకుంటున్న దిగుమతులపై 25% సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.. ఓ మత్తు పదార్థం తయారీకి అవసరమైన మూడి పదార్థాన్ని చైనా సరఫరా చేస్తోందని ఆరోపిస్తూ.. ఆ దిగుమతులపై 10 శాతం మేర అదనపు సుంకం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజవాయువు వంటి ఇంధన వనరులపై మాత్రం 10 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ సుంకాలు విధించడానికి అనువుగా అమెరికాలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ని ట్రంప్ ప్రకటించడం విశేషం. నిషేధిత మాదకద్రవ్యాలు అమెరికాలోకి రావడం.. వాటిని ప్రజలు వినియోగించడం వల్ల ఆరోగ్య సంక్షోభం ఏర్పడుతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్లకు, వాటి ముఠాలను చైనా అడుకోవడం లేదని ట్రంప్ మండిపడుతున్నారు. అందువల్లే ఆయన వైట్ హౌస్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేయించారు. ఇక మెక్సికోలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించడం విశేషం. మాదకద్రవ్యాల తయారీ, ముఠాలకు మెక్సికో ప్రభుత్వం సహకరిస్తుందని ట్రంప్ మండిపడుతున్నారు. అవన్నీ కూడా అమెరికాకు చేరుతున్నాయని.. మాదకద్రవ్యాలను అధికంగా తీసుకోవడం వల్ల అమెరికన్లు చనిపోతున్నారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తన వైట్ హౌస్ ద్వారా ప్రకటించారు.మరోవైపు తనపై విధించిన సుంకాలపై మెక్సికో, చైనా కూడా ఘాటుగానే స్పందించాయి. అమెరికాపై ప్రతికార చర్యలు ఉంటాయని ప్రకటించాయి. తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని చూపిస్తామని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు.. 30 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై వెంటనే.. మరో 125 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 21 రోజుల తర్వాత సుంకాలు విధిస్తామని వెల్లడించారు.. ఈ లోగానే కెనడా కంపెనీలు ఉత్పత్తుల తయారీకి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని అన్నారు. ఇక మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా తమ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఇతర మార్గాలు కూడా వెతుక్కోవాలని.. ప్లాన్ బి అమలు చేయాలని అధికారులకు సూచించారు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. ప్రభుత్వానికి.. మాదకద్రవ్యాలను రవాణా చేసే ముఠాలతో ఎటువంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు.. ఇక అమెరికా తమపై విధించిన పది శాతం ఆదనపు సుంకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థలో సవాల్ చేస్తామని చైనా హెచ్చరించింది. ట్రంప్ తీసుకొని నిర్ణయం డబ్ల్యూటీవో నిబంధనలను వ్యతిరేకించడమేనని మండిపడింది..