Thursday, January 16, 2025

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి

- Advertisement -

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి

TTD Chairman should resign immediately

* తొక్కిసలాట.. ఎవరి పాపం – ఎవరికి శాపం..?

స్వామివారి భక్తుల మరణం బాధాకరం..
*
వారి కుటుంబ సభ్యులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలి..
*
తిరుమలలో ఏర్పాట్లులో లోపాలు లేకుండా చూడాలి
*
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్..

తిరుమల స్వామి వారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చిన భక్తుల తోపులాట, తొక్కిసలాట కారణంగా ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమైన విషయమని.., బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.. స్వామి వారి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వస్తారని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ.. టీటీడీ పాలకమండలి, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది తగదని పేర్కొన్నారు.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలనీ ఆయన డిమాండ్ చేసారు.. అధికార పార్టీ పెద్దలు, ప్రజా ప్రతినిధుల సేవలో తరిస్తూ, సామాన్య భక్తుల మరణాలకు పరోక్షంగా కారణమైన టీటీడీ పాలకమండలి మొత్తం రద్దు చేయాలని.., చైర్మన్ వెంటనే తప్పుకోవాలని ఆర్సీవై డిమాండ్ చేశారు
ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.. “టీటీడీ అధికారులు కానీ, పాలకమండలి కానీ.. ఉత్తుత్తి ప్రచారానికి ఇస్తున్నంత సమయం ఏర్పాట్ల కోసం ఇవ్వలేదు అనిపిస్తుంది. టోకెన్లు జారీ కేంద్రాలు సమాచారం సరిగా లేదు, లక్షలాది భక్తులకు తగిన ఏర్పాట్లు లేవు, భక్తుల భద్రత విషయంలో ఏమరుపాటు తగదు.. ఇంకా దర్శనాలు ఆరంభం కాకుండానే ఈ ఘటన జరగడం దురదృష్టకరం.. మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున ఆదుకోవాలి.. వీలైతే వారి కుటుంబ సభ్యులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలి.. అలాగే రానున్న రోజుల్లో ఏ ఒక్క ప్రాణము పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం టీటీడీ పాలకమండలి, ప్రభుత్వంపై ఉంది.. దీనిలో ఏమాత్రం అలసత్వం తగదు.. వైకుంఠ ద్వారా దర్శనాలు జరిగినన్ని రోజులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. వీఐపి తాకిడి, సేవ తగ్గించి, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను” అని రామచంద్ర యాదవ్ ప్రకటన జారీ చేశారు…!!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్