Thursday, January 16, 2025

హిందూ సనాతన ధర్మపరిరక్షణలో టీటీడీ ముందంజ

- Advertisement -

హిందూ సనాతన ధర్మపరిరక్షణలో టీటీడీ ముందంజ

– అనుగ్రహభాషణంలో స్వామీజీల ఉద్ఘాటన

తిరుమల,
తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ నిర్వహిస్తున్న మూడు రోజుల ధార్మిక సదస్సులో మొదటి రోజైన శనివారం పలు ప్రాంతాల నుండి 25 మంది స్వామీజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీలు అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో టీటీడీ ముందంజలో ఉందని, భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వామీజీలు అనుగ్రహభాషణం వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యాశ్రీశ తీర్థ స్వామి :

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, వ్యాప్తిలో టీటీడీ దేశంలోనే ముందుంది. టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డిని అభినందిస్తున్నా. హిందూ ధర్మ ప్రచారానికి ఆయన గతంలోను, ప్రస్తుతం అంకితభావంతో సేవలందిస్తున్నారు. అదేవిధంగా అఖండ సుందరకాండ, గీతాపారాయణం మొదలైన పారాయణాలతో యువతలో భక్తిని పునరుజ్జీవింప చేసేందుకు టీటీడీ ఈవో   ఎవి.ధర్మారెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు.

శుశ్రుతానంద మాతాజీ

సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం మరిన్ని ధార్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు టీటీడీ ఛైర్మన్, ఈవోల నిబద్ధత, అంకితభావాన్ని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమాలు ప్రతి మూలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

టీటీడీ ధార్మిక కార్యక్రమాలు యువతలో ధార్మిక ఉత్సాహాన్ని నింపి సన్మార్గం వైపు నడిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై వస్తున్న అవాస్తవాలతో కూడిన విమర్శలను ఎస్విబిసి ధార్మిక కార్యక్రమాల ద్వారా టీటీడీ విజయవంతంగా తిప్పి కొడుతోంది. గో సంరక్షణ కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కూడా తన అధికారిక నివాసంలో గోశాలను నిర్మించి గోసంరక్షణ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయం. ధార్మిక కార్యక్రమాలకు కూడా టీటీడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలి.

శివ దర్శనం మాతాజీ

సమాజంలో శత్రుత్వాలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిలో సనాతన హిందూ భావాలను బయటకు తీసుకురావడానికి ధార్మిక కార్యక్రమాలు చాలా అవసరం. పాఠశాల, కళాశాల స్థాయిలో సిలబస్‌లో ధార్మిక విషయాలను జోడించాలి. గతంలో శుభప్రదం నిర్వహించేవారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు దీన్ని పునఃప్రారంభించాలి.

దేవనాధ రామానుజ జీయర్ స్వామీజీ

తిరుమల దివ్యక్షేత్రంలో ధ్యాన మందిరాలు ఏర్పాటు చేయాలి. ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధార్మిక కార్యక్రమాలను సమాజంలోకి తీసుకెళ్లాలి.  విద్యార్థులు, యువత, మహిళల్లో దాతృత్వం పెంచేలా చర్యలు తీసుకోవాలి.  శ్రీవారి సేవ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలి.

స్వస్వరూపానందగిరి స్వామి

తిరుమల తరహాలో గోవిందనామ స్మరణను తిరుపతి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల్లో వినిపించాలి.

శ్రీ రామచంద్ర రామానుజ జీయర్

టీటీడీ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ద్రావిడ వేదాన్ని కూడా ప్రోత్సహించాలి.
విశ్వయోగి విశ్వంజీ

భారతదేశం త్వరలో ప్రపంచంలోనే శక్తివంతం అవుతుంది. తిరుమల నుంచి సనాతన ధర్మాన్ని ప్రపంచానికి టీటీడీ అందించాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్