Sunday, March 16, 2025

టీటీడీపి ఓటు ఎవరికి బదిలీ..

- Advertisement -

టీటీడీపి ఓటు ఎవరికి బదిలీ..
హైదరాబాద్,డిసెంబర్ 15
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే తెలుగుదేశం పార్టీ నిర్ణయం టీటీడీపీ నాయకుల్ని నొప్పించినా అది ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగ పడిందనేది కాంగ్రెస్‌ నాయకుల మెదళ్లను తొలుస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి దాదాపు మూడు శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా ఎన్నికల్లో పోటీ చేయలేదు.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రధానంగా ఆంధ్రా సెటిలర్ ఓట్లు అధికంగా ఉంటాయి. దాదాపు 40లక్షల మంది ఆంధ్రా స్థానికత ఉన్న వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌కు బదిలీ కాలేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో దెబ్బతినడానికి ఇదే కారణమని అనుమానిస్తున్నారు.తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం వల్ల కొంత లాభ పడినా, హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ, సెటిలర్ల ఓట్లు ఏ మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి బదిలీ కాలేదని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టీడీపీ ఓట్లు కొంత మేరకు కాంగ్రెస్‌కు బదిలీ అయినట్టు చెబుతున్నారు.తెలంగాణలో కనీసం 90కు పైగా సీట్లు వస్తాయని భావించినా ఆ మేరకు విజయం సాధించలేక పోవడానికి జనసేనతో పోటీ చేయడంతో పాటు టీడీపీ ఓట్లు బదిలీ కాకపోవడం కూడా కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీడీపీ మాదిరి జనసేన కూడా పోటీలో లేకుండా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మరికొన్ని సీట్లలో గెలిచి ఉండేదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64స్థానాలకే పరిమితం కావడానికి టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో ఓట్లు బదిలీ కాకపోవడం కూడా కారణమేనని చెబుతున్నారు. బిఆర్ఎస్‌కు వచ్చిన 39 ఎమ్మెల్యేల్లో ఎక్కువగా హైదరాబాద్‌ పరిధిలోనే వచ్చాయి. బిఆర్‌ఎస్‌ మీద నిజంగా వ్యతిరేకత కంటే స్థానికంగా తమ ప్రయోజనాలను బిఆర్‌‌ఎస్‌తో ఉపయోగమనే భావనతోనే ఓట్ల బదిలీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీకి 8సీట్లు దక్కాయి. అదే సమయంలో బీజేపీ-జనసేన కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఆ స్థానాల్లో కూడా బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు.తెలంగాణలో విజయం సాధించిన బిఆర్‌ఎస్‌కు 37.35శాతం ఓట్లు దక్కితే, కాంగ్రెస్‌ పార్టీకి 39.40శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల పరంగా రెండు పార్టీలకు మధ్య రెండు శాతం మాత్రమే వ్యత్యాసం ఉంది. టీడీపీ నుంచి ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగి ఉంటే కనీసం ఐదారు శాతం వ్యత్యాసం ఉండేదని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు హైదరాబాద్‌లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు కూడా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్