Sunday, September 8, 2024

టీటీడీపీ ఓటు… ఎవరికి చేటు

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 17, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంపై ఇంకా సందిగ్ధత వీడటం లేదు. గత వారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో టీటీడీపీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధం అవుతున్నాయి. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. నేడు బీజేపీ కూడా తొలి జాబితా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. బిఆర్‌ఎస్‌ బిఫారంలు కూడా ఇచ్చేసింది.మిగిలిన అభ్యర్థుల జాబితా కూడా నేడు విడుదలయ్యే అవకాశాలున్నాయి.అన్ని పార్టీలు ఉత్సాహంగా పరుగులు పెడుతుంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న తెలుగుదేశం పార్టీలో మాత్రం స్తబ్ధత వీడటం లేదు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలనే చర్చలు ఆ పార్టీలో జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను పెంచడానికి పోటీ నుంచి తప్పుకోవాలనే ప్రతిపాదనలు కూడా టీడీపీలో జరుగుతున్నాయి. అయితే బీజేపీతో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరలేదు. బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు.ఓ వైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కావడం, నెల రోజులకు పైగా జైల్లో ఉండటంతో, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం కంటే బీజేపీకి మద్దతివ్వడం బెటర్ అని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించినా టీడీపీలో మాత్రం ఎలాంటి కదలిక లేదని చెబుతున్నారు. బీజేపీతో అధికారిక పొత్తు ఉన్నా లేకున్నా ఆ పార్టీకి లబ్ది చేకూర్చడం ద్వారా ప్రస్తుత పరిణామాల నుంచి కాస్తైనా గట్టెక్కాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

TTDP vote... Whose hand?
TTDP vote… Whose hand?

మరోవైపు పరిమిత స్థానాల్లో అయినా పోటీ చేయాలని తెలంగాణ పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో బిఆర్‌ఎస్ పార్టీ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.హైదరబాద్‌‌తో పాటు తెలంగాణలో స్థిరపడిన తెలంగాణ సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపుతాయని బిఆర్‌ఎస్ నేతలకు రాయబారాలు నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌‌కు సెటిలర్ల ఓట్ల రూపంలో ప్రతికూలత ఎదురవుతుందనే వాదనల్ని ఆ పార్టీ లైట్‌ తీసుకుంది.2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసిందని ఆ సమయంలో సెటిలర్ల ఓట్లేవి తమకు రాలేదని బిఆర్‌ఎస్‌ గుర్తు చేస్తోంది. 2018 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసిందని అప్పుడు కూడా సెటిలర్ల ఓట్లు తమకు పడలేదని చెబుతున్నారు.హైదరాబాద్‌‌లో ఉన్న 30లక్షల మంది సెటిలర్లలో ఎంత మంది టీడీపీ అనుకూల వర్గం వారు ఉంటారనే వాదన కూడా బిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చర్చించిన తర్వాత చంద్రబాబు విషయంలో తమ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ద్రబాబు ఓట్లు ఎప్పుడు బిఆర్‌ఎస్‌ పడలేదని, తమ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నించారని బిఆర్‌ఎస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు.ఈ అంశాలన్నింటిని బేరీజు వేసుకున్న తర్వాత ద్రబాబుతో వ్యక్తిగత అనుబంధం ఉన్న నేతలకు ఆయనకు అనుకూలంగా మాట్లాడానికి పార్టీ అనుమతించినట్టు చెబుతున్నారు. మల్లారెడ్డి,అరికపూడి గాంధీ, తలసాని శ్రీనివాస్, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్ వంటి నాయకులు చంద్రబాబు అరెస్ట్‌ను తప్పు పడుతూ మాట్లాడారు. ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన రాజకీయంగా స్పష్టమైన విధానంతోనే బిఆర్‌ఎస్ ఉందని చెబుతున్నారు.ఇటీవల హైదరాబాద్‌ మెట్రోలో నిరసన కార్యక్రమాలను అడ్డుకున్న తర్వాత టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేసింది. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ దూషణలకు దిగారు. టీడీపీ అనుసరిస్తున్న ఈ తరహా విధానాలు అంతిమంగా ఆ పార్టీకే చేటు చేస్తాయని గుర్తించలేకపోతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు జగన్‌కు సహకరిస్తున్నారనే భావనలో టీడీపీ వారిని టార్గెట్‌ చేయడం,అంతిమంగా బిఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందని చెబుతున్నారు.మెట్రో రైలు ప్రయాణాలకు దేశంలో ఎక్కడైనా స్టాండర్డ్ ఆపరేషన్స్‌ ఉంటాయని, ఎవరైనా మెట్రో యాజమాన్యాల నిబంధనలకు అనుగుణంగానే ప్రయాణించాల్సి ఉందనే విషయం విస్మరించి మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, రైల్లో హంగామా చేయడం ఏమిటని సోషల్ మీడియా వేదికలపై బిఆర్ఎస్‌ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా చంద్రబాబుకు ఏమి ప్రయోజనం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను తిట్టడం ద్వారా అంతిమంగా తెలంగాణలో వారికి సానుభూతి పెంచుతున్నారని చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్