ఖమ్మం: మంత్రి పువ్వాడ మాఫియాని రౌడీలని పెట్టుకుని అరాచక పాలన చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ది తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించరు. నూటికి 99 మంది పోలీసులు ధర్మానికి కట్టుబడి పనిచేస్తున్నారు. ఒకరిద్దరు పోలీసులు బ్రష్టు పట్టిపోయారు అడ్డగోలుగా అరాచకం చేశారు. వారు ఇక దేనికి పనికిరారు. ఈ ఖమ్మం గడ్డ ఎప్పుడు అహంకారానికి తలవంచదు నువ్వు ఇచ్చే అయిదు పది వెంట్రుక తో సమానం అంటూ తలలో వెంట్రుకలు చూపిస్తూ పువ్వాడ పై ఘాటు వ్యాఖ్యలు తుమ్మల చేసారు. ఖమ్మం నగరం లో రోడ్ షో నిర్వహించిన తుమ్మల, మాట్లాడుతూ అవినీతి అరాచకమైన పార్టీ ని కూల్చడానికి ఇన్ని జండాలు కలిశాయి. తాజా సర్వే ప్రకారం రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి 78 నుండి 82 సీట్లు వస్తున్నాయి ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ పందాలు ఎక్కువ కాయడం లేదు కానీ ఆంధ్రా లో వీళ్ళ మీద ఎక్కువగా కాస్తున్నారు. వీళ్ళ మీద ఆంధ్ర లో 100 కోట్ల పందాలు కాశారు అవి గెలుపు ఓటముల మీద కాదు మెజారిటీ మీద కాస్తున్నారని అన్నారు.