- Advertisement -
కుడా ఛైర్ పర్యన్ గా తుమ్మల రామస్వామి
Tummala Ramaswamy is the chairperson of KUDA
కాకినాడ
కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథా రిటీ (కుడా) చైర్పర్సన్ గా నియమి తులైన తుమ్మల రామ స్వామి పదవి బాధ్యత స్వీకరణ మహోత్స వం కాకినాడ ఆర్టీవో ఆఫీస్, ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు నందు కుడా కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎం ఎఎల్సీ యనమల రామకృష్ణుడు, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, జగ్గంపేట, ప్రత్తిపాడు, అనపర్తి శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్, రాష్ట్ర పౌరసరఫరాల చైర్మన్ తోట సుధీర్, ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై తుమ్మల రామస్వామికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి బాధ్యతల స్వీకరిస్తూ రిజిష్టర్ లో సంతకం చేశారు. కుడా వీసీ, కాకినాడ కమిషనర్ భావన చైర్మన్ రామస్వామితో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా కుడా పరిధిలోని ప్రాంతం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకముంచి కుడా ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 350 గ్రామాల పరిధిలో విస్తరించిన కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథారిటికి సంబంధించి పూర్తి పారదర్శకతతో, అవినీతి రహితంగా సేవలందిం చడం జరుగుతుందని ఈ సందర్భం గా తుమ్మల రాస్వామి తెలియ జేశారు.
- Advertisement -