స్పష్టత లేని ఏసీబీ నోటీసులు–కేటీఆర్
Unclear ACB notices--KTR
హైదరాబాద్
ఫార్ములా- ఈ అంశంలో తనపై మోపిన అక్రమ ఆరోపణల పైన అవినీతి నిరోధక శాఖ నోటీసుకి స్పందించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ అంశంలో తనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు అయన బంజారా హిల్స్ లోని ఏసిబి కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అయన సూచించారు. రెండవ తేదీన తనకు ఏసిబి ఇచ్చిన నోటీసుకి రాతపూర్వకంగా స్పందించారు. తన స్పందనను రాతపూర్వకంగా ఏసిబి అధికారులకు అందించారు. డిసెంబర్ 18వ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు . సెంబర్ 31వ తేదీన తుది వాదనలు ముగిసిన ఈ అంశంలో హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిందని కేటీఆర్ తెలియజేశారు. ఇదే కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను వినిపించిన ఏసీబీ అని కేటీఆర్ గుర్తు చేసారు. హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉన్న సందర్భంలో తనకు ఏసీబీ నోటీసు ఇచ్చిందని అయన అన్నారు.
మొన్న ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులో ఈరోజు (ఆరవ తేదీన) సమాచారం అందించాలని, సమాచారంతోపాటు, డాక్యుమెంట్లను అందివ్వాలని కోరిన ఏసీబీ నోటీసులను ప్రస్తావించారు. అయితే తనకు ఏ అంశాల పైన సమాచారం కావాలో అన్న విషయాన్ని ఏసీబీ నోటీసులో స్పష్టంగా ప్రస్తావించలేదని అన్నారు. దీంతోపాటు ఏయే అంశాలు తాలూకు డాక్యుమెంట్లు, అడుగుతున్నారో కూడా నోటీసులో తెలపలేదని కేటీఆర్ అన్నారు.