కౌలు రైతులకు షరతులు లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

- Advertisement -

కౌలు రైతులకు షరతులు లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

Unconditional bank loans should be granted to tenant farmers

దేవనకొండ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ముందు కౌలు రైతులతో ధర్నా

ఏపిజిబి మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన కౌలు రైతు సంఘం నాయకులు

దేవనకొండ జనవరి 18
దేవాదాయ, ధర్మదాయ మరియు వివిధ ట్రస్ట్ భూములలో సాగు చేసుకుంటూ కౌలు రైతు కార్డు పొందిన ప్రతి రైతుకు సొంత భూమితో సంబంధం లేకుండా బ్యాంకుల నందు రుణాలు మంజూరు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.తిమ్మయ్య,రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు వై.కండప్ప లు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా శనివారం దేవనకొండ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కౌలు రైతులతో ధర్నా నిర్వహించి, అనంతరం మేనేజర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. రోజు రోజుకి సాగు భూమి విస్తీర్ణం తగ్గుతుంది,జనాభా  పెరుగుదల అధిక మవుతుందన్నారు. కుటుంబ పోషణ భారం అవుతుడడంతో భూయజమాని దగ్గర నుంచి భూముని కౌలుకి చేసి సాగు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.భూమిని కౌలుకి చేసే ప్రతి రైతు పేదవాడే నని గమనించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మరియు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము కౌలు రైతులకు ఎటువంటి జామీను అవసరం లేని మరియు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోలేని పక్షంలో బ్యాంకుల ముందు ఆందోళన చెపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు వై.శేఖర్, కృష్ణ, మనోహర్, కవులన్న,పటేల్, రామంజి, రఫీ, నరేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular