మిట్ట కందల గ్రామంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టండి.
Undertake sanitation work in Mitta Kandala village.
ఎమ్మార్పీఎస్ స్వాములు మాదిగ డిమాండ్
శ్రీశైలం
నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్ట కందల గ్రామంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు మాదిగ ప్రభుత్వ అధికారుల డిమాండ్ చేశారు
సందర్భంగా స్వాములు మురికి వాడలను చూపిస్తూ ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్ట కందల గ్రామంలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఎంపీపీ స్కూల్ ఎస్సీ కాలనీలలోనీ ప్రధాన కూడలిల లో రోడ్లపై నిరంతరం మురికి నీరు ప్రవహించి ఆ నీటి ద్వారా దోమలు వ్యాపించి డెంగ్యూ మలేరియా విష జ్వరాలతో బాధపడుతున్నటువంటి సంఘటనలు గ్రామంలో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ విషయాలపై పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం శూన్యమని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామపంచాయతీలను పటిష్టం చేయాలని ప్రభుత్వం తలంచి లక్షల్లో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టి చెత్త కుప్పలు మురికి నీరు లేకుండా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిమెంట్ రోడ్లకు ఇరువైపులా సైడ్ కాలువలు నిర్మించాలని ఆయన అన్నారు.గ్రామంలోని ప్రజలు మురికి నీరులోనే నడసాల్సిన పరిస్థితి వస్తుందని వెంటనే మండల అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని లేదంటే ఈ విషయాలపై జిల్లా కలెక్టర్కు పంచాయతీ అధికారులపై ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బతుకులయ్య పోలీస్ వెంకటయ్య సుదర్శనం అబ్రహం ఆగస్టు తదితరులు పాల్గొన్నారు