నిరుద్యోగ ఫోరం నేత అరెస్టు

- Advertisement -

నిరుద్యోగ ఫోరం నేత అరెస్టు

Unemployment forum leader arrested

—డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో

నిరుద్యోగ ఉద్యమాన్ని ఆపలేరు.

ఫోరం నేత శ్రీకృష్ణదేవరాయలు
తాండూర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా తాండూర్ మండలానికి చెందిన తెలంగాణ నిరుద్యోగ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ని తాండూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఉపముఖ్యమంత్రి కి నిరుద్యోగుల సమస్యలను విన్నవించడానికి వెళ్లడానికి వీలు లేకుండా పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.గత పాలకుల నిర్లక్ష్యం వలన నిరుద్యోగులు నష్టపోయారని అదే తీరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని అన్నారు.ప్రశ్నించే గొంతుల్ని ఆపే ప్రయత్నం చేసిన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల తెలంగాణ నిరుద్యోగ ఫోరం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular