యూనియన్ బ్యాంకు ఋణాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
Union Bank loans should be utilized…

-యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ శంకర్ హెంబ్రం

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న శంకర్ హెంబ్రం చెక్కులు పంపిణీ చేస్తున్న రీజినల్ హెడ్

జగిత్యాల :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో వివిధ పథకాల ద్వారా అందించే ఋణాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యూబీఐ రీజనల్ హెడ్ శంకర్ హెంబ్రం అన్నారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణ కేంద్రంలో గల స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలు యందు మంగళవారం రోజు సాయంత్రం వేళలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఘనంగా మాట్లాడారు. యూనియన్ బ్యాంకు ఖాతాదారులు ఋణాలను సకాలంలో పోంది తిరిగి చెల్లింపులు సక్రమంగా చేయడమే ముఖ్యం కాదని వాటిని సద్వినియోగం కూడా చేసుకుని ఆర్థిక వృద్ధి సాధించాలని ఆయన ఘనంగా ఆకాంక్షించారు. వ్యాపార, వాణిజ్య రుణాలు పోందిన ఖాతాదారులు తాము ఉపాధి పోందడమే కాకుండా యూనిట్లు ప్రారంభించి మరి కోంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన వారిని కోరారు. ఇట్టి కార్యక్రమ నిర్వహణ శుభ సందర్భంగా వ్యాపార, వ్యవసాయ, గృహ నిర్మాణానికి సంబంధించి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు సంబందించిన ఋణాల మంజూరు పత్రాలను వారికీ ఘనంగా అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, డిప్యూటీ రీజనల్ హెడ్ శివ కోటయ్య, ఛీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, యూనియన్ బ్యాంకు జగిత్యాల కలెక్టరేట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రావు లతో పాటు, వివిధ శాఖలకు చెందిన యూనియన్ బ్యాంకు మేనేజర్లు శీలం రవి తేజ, వినోద్, స్వరూప్, సంజీవ్, చేతన్, షఫీక్, రాజు, దిలీప్, శ్రీ లాల్, శ్రీకాంత్, ఆశిష్, ఎఫ్ఎల్సీ మధు సూదన్ లతో పాటు, యూనియన్ బ్యాంకు ఖాతాదారులు, యూనియన్ బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular