- Advertisement -
బారువ కాలేజీలో డొక్కా సీతమ్మ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Union Minister Rammohan Naidu launched Dokka Seethamma Scheme at Baruva College
శ్రీకాకుళం
ఆరోగ్యవంతమైన సమాజానికి విద్యార్థి దశే కీలకం , ఈ ప్రాధాన్యతను గుర్తించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ ప్రభుత్వ కళాశాలలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు , కలెక్టర్ స్వప్నిల్ దినకర్ లో కలసి అయన ప్రారంభించారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో ప్రారంభమవుతున్న
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వారి లోచనలను తెలుసుకోవడం అదృష్టం గా ఉందని అన్నారు.
- Advertisement -