Sunday, September 8, 2024

 ‘రూమ్ టు రీడ్ కు అనూహ్య  స్పందన

- Advertisement -

 ‘రూమ్ టు రీడ్ కు అనూహ్య  స్పందన
కరీంనగర్, మే 22 (వాయిస్ టుడే)
విద్యాబోధనే కాదు, కావాల్సిన కథలు, విని గత చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంది. అందుకు రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ పోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్ సెట్లు రూపుదిద్దుకున్నాయి.ఆన్లైన్ గేములకు అత్తుకుపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను కథలు చదివేలా ప్రోత్సహించాలి. పాఠ్య పుస్తకాలలోని పాఠాలను కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని చదువుకోవచ్చు.పఠానాసక్తి పెంచాలనే రూమ్ టు రీడ్ సంస్థ లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ రూపొందించింది. ఇందులో ఎనిమిది భాషల్లో ఉన్న కథలను పొందుపర్చింది. ఈ కథలను చదవడంతో ప్రాథమిక దశలో విద్యార్థుల్లో మౌఖిక భాషా వికాసం, అభ్యసనాసామర్థ్యం వృద్ధిచెందుతుంది.’రూమ్ టు రీడ్’ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ సమన్వయంతో వేసవి సెలవుల్లో నచ్చిన కథలు చదివేందుకు లిటరసీ క్లౌడ్ వెబ్ సైట్ ను అభివృద్ధి చేశారు. మౌఖిక భాషాభివృద్ధి, అభ్యసన సామర్థ్యాల పెంపు, విషయ అవగాహన శక్తి పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది. పిల్లల స్థాయిని బట్టి ఆకర్షణీయ బొమ్మలతో హింది, ఆంగ్లంతోపాటు ఎనిమిది భాషల్లో 1200 పైచిలుకు పుస్తకాలను వెబ్సైట్‌లో ఉంచారు. ఆంగ్లంలో 406, తెలుగులో 117, మరాఠీ, హిందీ, గుజరాతీ, కన్నడ భాషల్లోనూ కథలను ఉంచారు.గూగుల్ సెర్చ్ https://staging.literacycloud.org/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఇందులో కోరిన భాషలో కథల పుస్తకాలను ఎంచుకొని చదువుకోవచ్చు. అనంతరం సంబంధిత కథను ఇతరులకు చెప్పడం, బొమ్మలు గీయడం, వ్యాక్యాల్లో రాయడం ద్వారా విద్యార్థి భాషా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు.జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లల వాట్సాప్ గ్రూపులో ఈ వెబ్సైట్పై అవగాహన కల్పించి ఉపయోగించుకునేలా చూడాలి. తల్లిదండ్రులు కూడా ఈ కథలను వినడానికి మొబైల్ ఫోన్లను పిల్లలకు ఇచ్చి పర్యవేక్షించాలి. ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా కథలు వినవచ్చు.కరోనా సమయంలో పాఠశాలలు మూతపడి పిల్లలు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా విద్యావంతులు వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు శతక పద్యాలను ఆడియో రికార్డింగ్ చేసి కృత్య పత్రాలు తయారు చేశారు.విద్యా శాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్ఈర్టీ) ఆధ్వర్యంలో పుస్తకాలలోని పాఠాలను రికార్డింగ్ చేసి విద్యార్థులకు అందుబాటులో వెబ్సైట్లో పెట్టారు. కేబీ. శర్మతోపాటు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్తోపాటు కొందరు తెలుగు పండితులు, ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలను ఆడియో రికార్డింగ్ చేశారు. పాఠ్య పుస్తకంపై ఉండే క్యూఆర్ కోడ్ సహాయంతో పాఠాలను వినవచ్చు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,19,680, జగిత్యాల జిల్లాలో 1,31,948, పెద్దపల్లి జిల్లాలో 84,069, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 65,466 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వేసవిలో బాలల అభ్యసనాసామర్థ్యం పెంచేందుకు, ఆసక్తి ఉన్న కథలను చదివించడం.. వినేలా చూడాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.విద్యార్థులు ఏ రోజుకారోజు కొత్త కథను వినేందుకు రూమ్ టు రీడ్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది. 040-4520-9722 నంబర్ కు డయల్ చేయడం ద్వారా విద్యార్థులకు అభిరుచి కల్గించే తెలుగు కథలు వినవచ్చు. లిటరసీ క్లౌడ్ వెబ్సైట్, క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకొని శ్రవణ, పఠనా నైపుణ్యాలను పెంచుకోవచ్చు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్