ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ఆవిష్కరణ పాల్గోన్న కవిత

- Advertisement -

ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ఆవిష్కరణ
పాల్గోన్న కవిత
హైదరాబాద్

Unveiling of the activists’ land struggle poster
Kavitha participated
బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అవిష్కరించారు.
కవిత మాట్లాడుతూ జులై 2న ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం. ఉద్యమకారుల భూపోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలి. జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేసి ప్రభుత్వ  భూములు స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందే. మరో మారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారు. అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మనందరి చారిత్రక కర్తవ్యం.  ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలి. మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ల జీవితాలనే త్యాగం చేశారు. కనుక వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular