Sunday, September 8, 2024

ఎర్ర రక్త కణాలు క్షీణించినప్పుడు పసుపు రంగులోకి మారనున్నమూత్రం

- Advertisement -

ఎర్ర రక్త కణాలు క్షీణించినప్పుడు పసుపు రంగులోకి మారనున్నమూత్రం
సెల్ బయాలజీ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్‌ అధ్యయనం లో వెల్లడి
న్యూ డిల్లీ  5
కొన్ని సందర్భాల్లో మూత్రం పసుపు రంగులో రావడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే.. ఇందుకు సరైన కారణాలేంటనేది ఎవ్వరికీ తెలీదు. ఏమైనా మార్పుల కారణంగా అలా వస్తూ ఉండొచ్చని అందరూ అనుకుంటుంటారు కానీ, అసలు కారణం ఏంటనే విషయంపై స్పష్టత లేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆ ‘పసుపు’ రంగు వెనుక గల కారణమేంటో తేలింది. నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెల్ బయాలజీ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన బ్రాంట్లీ హాల్ & అతని బృందం ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. మూత్రం పసుపు రంగులోకి ఎందుకు మారుతుంది? దీని వెనుక కారణం గుర్తించేందుకు ఇంతకాలం ఎందుకు పట్టింది? అనేది వాళ్లు తమ అధ్యయనంలో వివరించారు.మూత్రం.. ఇది మన శరీరంలో సహజ డ్రైనేజీ వ్యవస్థ. మూత్రపిండాల ద్వారా రక్తం నుండి ఫిల్టర్ చేయబడిన వ్యర్థాలు, అదనపు నీరుని కలిగి ఉంటుంది. ఈ వ్యర్థాల్లో.. హిమోగ్లోబిన్‌ని ఉపయోగించి శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే RBCలు (ఎర్రరక్త కణాలు) వంటి మృతకణాలు ఉంటాయి. ఈ కణాలు హీమ్ అనే సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తాయి. క్రమంగా ఆ ఎర్రరక్త కణాలు క్షీణించి, వాటి హీమ్ మూత్రాన్ని పసుపు రంగులోకి మార్చుతుంది. నిజానికి.. మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణం ‘యురోబిలిన్’ రసాయనం అని శాస్త్రవేత్తలకు ఇదివరకే తెలుసు. కానీ.. మూత్రంలో యురోబిలిన్ ఉనికికి దారితీసే ప్రక్రియలో దశల గురించి వారికి ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు తాజా పరిశోధన అందుకు సమాధానాలను బయటపెట్టేసింది. హీమ్ సమ్మేళనాన్ని విచ్ఛిన్నం చేయడంలో ‘గట్ బ్యాక్టీరియా’ కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా మూత్రం పసుపు రంగులో వస్తుందని ప్రొఫెసర్ బ్రాంట్లీ పేర్కొన్నారు.‘‘ఎర్ర రక్త కణాలు తమ ఆరు నెలల జీవితకాలం తర్వాత క్షీణించినప్పుడు.. బిలిరుబిన్ అనే నారింజ వర్ణద్రవ్యం ఒక బైప్రోడక్ట్‌గా ఉత్పత్తి అవుతుంది. గట్ బ్యాక్టీరియాలోని ‘ఫ్లోరా’ ఆ బిరుబిలిన్‌ని అణువుగా మార్చగలదు. దానికి ఆక్సిజన్ అందితే.. అది పసుపు రంగులోకి మారుతుంది. ఈ అణువు , యూరోబిలిన్‌లే.. మూత్రం పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం’’ అని బ్రాంట్లీ హాల్ చెప్పుకొచ్చారు. కాగా.. ఇదే అధ్యయనం ఈ ప్రతిచర్యకు కారణమయ్యే ఎంజైమ్ గురించి కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఎంజైమ్ పెద్ద ప్రేగులలోని ఫర్మిక్యూట్స్ & ఇతర గట్ బ్యాక్టీరియా సహాయంతో యూరోబిలినోజెన్‌గా విచ్ఛిన్నమవుతుంది. అనంతరం గాలి సమక్షంలో అది యూరోబిలిన్‌గా మారుతుందని బ్రాంట్లీ బృందం కనుగొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్