Wednesday, February 19, 2025

ఉష్…అది ఆయుష్…!.?

- Advertisement -

ఉష్…అది ఆయుష్…!.?

Ush...is that Aayush...!.?

  ప్రభుత్వం మారినా పాతవాసనలే..!
అడ్డగోలు జి,ఓకు బలవుతున్న బడుగులు
అంతా వారి కనుసన్నల్లోనే…
అడిగితే అవమానాలు..వేధింపులు
తీరు మారని ఆయుష్కు చికిత్స అత్యవసరం
ఆయుష్ శాఖ అంటే ఒకప్పుడు నిఖార్సైన శాఖ,రోగుల సేవ తప్ప మరో ధ్యాసలేని వైద్యులు,సిబ్బంది..అటెండర్ స్థాయి నుంచి డైరక్టర్ దాకా వారి వారి పనులు వారు నిశ్చింతగా చేసుకుంటూ పోయేవారు.అన్ని వ్యవస్థలలోనూ జోక్యం చేసుకుని వాటిని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం ఈ ఆయుష్లోనూ వైరస్లా జొరబడిరది. అలోపతి వైద్యవిధానంలో సైతం నయం కాని చాలా జబ్బులను నయం చేసే ఆయుష్ విభాగం తన శాఖలో జొరబడిన వైరస్ను కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు దాటినా ఏమీ చేయలేని దుస్థితిలో వుంది.వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న అడ్డుగోలు నిర్ణయాలతో ఆయుష్లో వైద్యం తక్కువ వేదన ఎక్కువగా మారింది. మందుల కొనుగోలు, ఇష్టా రీతిన బదిలీలు,డెప్యుటేషన్లు చేపట్టి ప్రశాంతంగా వుండేశాఖలోఅలజడులుసృష్టించారు.చివరకు ఆయుష్ శాఖలో ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, అనుకూలమైన ప్రదేశాలకు బదిలీలకు కూడా గండి కొడుతూ 16.03.2024 న తీసుకువచ్చిన జి.ఓ 53 పూర్తిగా ఆయుష్ ఉసురుతీసేలా మారింది,ఈ జి.ఓ వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఎస్సీ,ఎస్టీ మైనారిటీలే.
ఆయుష్ శాఖలోని ఎస్సీ,ఎస్టీలకు చెందాల్సిన ఉన్నత పోస్టులను ఇతర పోస్టులకు మారుస్తూ గత ఆయుష్ కమిషనర్  2024 ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రతిపాదన చేయడంతో అప్పటి ప్రభుత్వం ఆఘ మేఘా ల మీదఆయన ప్రతిపాదనలను కనీసం పరిశీలించకుండా, దాని లో టుపాట్లను ఏమాత్రంపరిగణనలోకి తీసుకోకుండా 16.03.2024న జి.ఒ.ఎం.ఎస్ నెం.53 ను విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోగుట్టుచప్పుడు లేకుండా తీసుకువచ్చిన ఈ జి.ఓ వల్ల అప్పటిదాకా కొనసాగుతున్న హేతుబద్దత లేకుండా పోయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్