- Advertisement -
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైకాపా
Vaikapa boycotted the irrigation union elections
విశాఖపట్నం
సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అప హాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరి స్తోందని వైసీపీ సీనియర్ నాయ కుడు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నీటిసంఘాల ఎన్నికల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నా రని బొత్స ప్రశ్నించారు. వీటన్నింటి కారణంగా ఎన్నికలను బహిష్క రిస్తున్నామన్నారు.రైతన్నలకు అండగా పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయ వంతమయ్యాయని ఆయన తెలిపారు. కాగా, సినీ నటులు అల్లు అర్జున్, మోహన్బాబుల విషయాల్లో ప్రభుత్వాలు తొంద రపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించాలని వ్యా ఖ్యానించారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 20 మంది మృతిచెందారని, ఆ ఘటనకు ఎవరిని బాధ్యులు చేశారనేది పరిశీలించాలని కోరారు.
- Advertisement -