రైతులకు అన్యాయం చేసిన వైకాపా నేతలు

- Advertisement -

రైతులకు అన్యాయం చేసిన వైకాపా నేతలు

Vaikapa leaders who did injustice to the farmers

కాకినాడ
వైసీపీ పాలనలో కాకినాడ సెజ్, సీపోర్ట్లను గన్ పెట్టి బెదిరించి లాక్కున్నారని, వాటాలుగా విభజించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి  తన బినామీలకు ధారాదత్తం చేసి రైతులకు అన్యాయం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ  ఆరోపించారు.. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెజ్ కోసం సేకరించిన 2వేల ఎకరాల డీనోటిఫికేషన్ భూమిలో 14 ఎకరాల భూమిని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతులకు ఏవిధంగా న్యాయం చేయనుందో తెలియజేసేందుకు వైసీపీ నేతలు దాడిశెట్టి రాజా, వంగాగీత,కురసాల కన్నబాబులకు తాను చాలెంజ్ చేసినా స్వీకరించలేదన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు రైతుల పక్షాన ఉంటారని, పరిహారం చెల్లించేందుకు త్వరలోనే కమిటీచేసి దోషులను శిక్షించి రైతులకు న్యాయం చేస్తామన్నారు..ఈమీడియా సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరారాబత్తుల రాజశేఖర్, ఎస్సీ జెడ్  రైతులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular