పరవాడలో హోరేతీస్తున్న వైకాపా ఇంటి ఇంటి ప్రచారం
– ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్న వైస్సార్సీపీ నాయుకులు,కార్యకర్తలు
పరవాడ,
మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ పరవాడ గ్రామం న్యూ కాలనీ, జగనన్న కాలనీ లో 6 వ రోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు ఆధ్వర్యంలో గురువారం నాయుకులు,కార్యకర్తలు ఇంటింటి ప్రచారం లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప వద్దకు వెళ్లగా తమకు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లో మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. పెందుర్తి వై.ఎస్.ఆర్.సి.పి అసెంబ్లీ అభ్యర్థి గా అన్నంరెడ్డి అదీప్ రాజ్ ను, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు మే 13 న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వైయస్సార్ పార్టీ అని, ప్రతి పేదవాడికి అనునిత్యం పథకాలు అందించి ఆదుకుంటున్న ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం. మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని అభ్యర్థించిన ఏకైక నాయకుడు మన జగనన్న అని ఈసారి కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ గారిని గెలిపించి జగనన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. సమస్యలు ఉంటే అదీప్ రాజ్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి దయవల్ల మాకు చాలా పథకాలు వచ్చాయంటూ లబ్ధి దారులు ఎదురు వచ్చి చెప్పడం ఎంతో ఆనందం ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, వార్డు మెంబెర్ లు వర్రీ పైడం నాయుడు, పైల హరీష్, వర్రీ లక్ష్మీ, పైల వెంకటరావు, వైస్సార్టుక్ జనరల్ సెక్రెటరీ పైల పైడం నాయుడు, వర్రీ భాస్కరరావు , చుక్క అప్పల నాయుడు , రొంగలి రాము, చందక చిన్నోడు, పైల ప్రసాద్, పైల అప్పారావు, బొంకులదిబ్బ యూత్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.