- Advertisement -
వైకుంఠ ఏకాదశి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha Ekadashi..devotees flocked to the temples
వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భద్రాచలంలో ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు
- Advertisement -