Tuesday, April 29, 2025

వంగవీటి రాధాకు పెద్ద పదవి

- Advertisement -

వంగవీటి రాధాకు పెద్ద పదవి
విజయవాడ, ఏప్రిల్ 12, ( వాయిస్ టుడే )

Vangaveeti Radha gets a big post

ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు పెద్ద పీట వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే సోమువీర్రాజు, కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. తాజాగా కాపు సామాజికవర్గానికి చెందిన మరో కీలక నేత వంగవీటి రాధాకు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు రాధాతో చంద్రబాబు మాట్లాడారు. అంతేకాదు త్వరలో వంగవీటి రాధాకు చంద్రబాబు కీలక పదవి ఇవ్వనున్నారని సమాచారం. ఆ మేరకు రాధాతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ ఎన్నికల్లో పోటీచేయలేదు.. కేవలం టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం మాత్రమే చేశారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింద.. అయితే రాధా పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా కలవడంతో ఆయన జనసేన పార్టీలోకి వెళతారనే టాక్ వినిపించింది. కానీ ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు.. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్‌సీపీలోకి తిరిగి వెళతారంటూ కొందరు ప్రచారం చేశారు. ఆయన మాత్రం పార్టీ మారలేదు.వంగవీటి రాధా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం కేవలం కూటమి పార్టీల తరఫున ప్రచారానికి పరిమితం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రచారం చేసి విజయం కోసం కృషి చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే.. పదవి ఇస్తామనే భరోసా కూడా ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు పదవి దక్కలేదు. ఈ క్రమంలో చంద్రబాబును కలవడంతో రాధాకు పదవిపై చంద్రబాబు ఏదైనా హామీ ఇచ్చారా అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయనకు పదవి వస్తుందని అనుచరులు భావిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. రాధా 2014 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరి.. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలోనే చెప్పారు చంద్రబాబు. ఎమ్మెల్సీలుగా కాపు సామాజికవర్గ నేతలకు అవకాశం కల్పించడం ద్వారా కాపుల్లో పట్టు సాధించనున్నారు చంద్రబాబు. ఇప్పుడు రాధాతో చంద్రబాబు భేటీ ఆసక్తికరంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల ఇచ్చిన ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక సమీకరణాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. అతి త్వరలో కీలక పదవి ఇవ్వనున్నట్లు రాధాకు సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. చంద్రబాబుతో జరిగిన చర్చ గుడ్ మూడ్ తో ఉందని తన సన్నిహితులతో రాధా చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్