Sunday, September 8, 2024

రెండో వారం నుంచి వారాహి యాత్ర

- Advertisement -

గుంటూరు, డిసెంబర్ 6, (వాయిస్ టుడే):  పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత వారాహి యాత్ర ఎప్పుడు. సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడటంతో వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చారా. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తాత్సారం వెనుక ఉన్న కారణాలు ఏంటి. లోకేష్ యువగళం కొనసాగుతున్న వేళ పవన్ యాత్రకు బ్రేక్ ఇచ్చారా.. పవన్ వారాహి యాత్ర 5.0 ఎప్పుడు.. ఎక్కడ నుంచి ప్రారంభం కానుంది. అనే అనేక ప్రశ్నలు సామాన్యుల్లోనే కాదు పవన్ అభిమానుల్లోనూ నెలకొంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్ర ఐదో విడత ప్రారంభం ఎప్పుడన్న అంశంపై జనసేన పార్టీలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పటికే వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. కృష్ణా జిల్లాలో నాల్గవ విడతతో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. వారాహి యాత్ర మొదటి విడత అన్నవరంలో ప్రారంభం కాగా నాలుగు విడతల్లో మొత్తం 37 రోజుల్లో 22 నియోజకవర్గాలలో పర్యటించారు. అయితే మొదటి నాలుగు విడతల్లో సక్సెస్ అయిన వారాహి యాత్రను 5విడత కూడా చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పవన్ చేపట్టబోయే 5వ విడత యాత్ర ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా ప్రారంభం అవుతుందన్న దానిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటం మరోవైపు టిడిపితో పొత్తుపై పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేలా అడుగులు వేస్తుండటం, సమన్వయ కమిటీల పేరుతో జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటాలు చేస్తున్న వేళ తాజాగా ఐదో విడత చేపట్టే యాత్రపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నారు పార్టీ నాయకులు. అందులో భాగంగా నాలుగు విడతల్లో ముగిసిన దాని కంటే భిన్నంగా.. మరింత ధీటుగా 5వ విడత యాత్రతో ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళికలు రచిస్తున్నారు పవన్. ఇప్పటికే టిడిపితో పొత్తుపై ప్రకటన చేసిన తర్వాత జరిగిన నాలుగో విడత యాత్రలో అటు తెలుగుదేశం నేతలు సైతం భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్నరాజకీయ పరిణామాల్లో చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ వారాహి యాత్ర చేపట్టడం రెండు పార్టీలకు మరింత బలం చేకూరుతుందని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే మొదట నాలుగు విడతల్లో పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర సక్సెస్ అవడంతో ఇప్పుడు మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. నాలుగు విడతల్లో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల వారిగా యాత్ర చేపట్టిన జనసేనాని ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లో చేపట్టేందుకు సిద్దమయ్యారు. అయితే అటు ఉత్తరాంధ్ర లేదా ఇటు రాయలసీమ నుంచి యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో ఉభయ గోదావరి,ఉత్తరాంధ్ర ,కృష్ణా జిల్లాలో పలు నియోజవర్గ పరిధిలో యాత్ర ముగియగా త్వరలో రాయలసీమ నుంచి చేపట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. వాస్తవానికి రాయలసీమ పరిధిలో పలు నియోకవర్గాల్లో పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ లేదు. అయితే జనవానితో పాటు కౌలు రైతులను ఆదుకోవడం కోసం చేపట్టిన కార్యక్రమాలకు మంచి మైలేజ్ రావడంతో ఇప్పుడు వారాహి యాత్ర రాయలసీమ జిల్లాల నుంచి చేపట్టేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.మొన్నటి వరకు వారాహి యాత్ర రాయలసీమ జిల్లాల పరిధిలో చేపడతారా లేదా అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే అనూహ్యంగా టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న తరువాత టీడీపీతో పాటు జనసేన క్యాడర్ రెండు కలిసి వచ్చే అంశాలుగా పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన తరువాత అవనిగడ్డ , పెడన, కైకలూరు, మచిలీపట్నం పరిధిలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. అందుకే టీడీపీ బలహీనంగా ఉన్న జిల్లాల పరిధిలో పవన్ కల్యాణ్ యాత్ర చేపడితే పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని పవన్ కళ్యాణ్ బావిస్తున్నారు. అందులో భాగంగా 5విడత చేపట్టే యాత్ర రాయలసీమ జిల్లాల పరిధిలో ప్రారంభించి గ్రాండ్ సక్సెస్ చేసి సీఎం ఇలాకాలో తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నారు.రాయలసీమ జిల్లాల పరిధిలో యాత్ర చేపట్టడం ద్వారా ఇప్పుడే అభ్యర్థులను బరిలో దింపితే అక్కడ పట్టు సాధించడానికి అవకాశం ఉందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. టీడీపీతో పొత్తుపై ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో రాజంపేట ,కడప, రైల్వే కోడూరుతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలో యాత్రను ప్లాన్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. సీమ జిల్లాల పరిధిలో వలసలు, వ్యవసాయం, వెనుకబాటు అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే రైతులను ఆదుకోవడానికి చేపట్టిన యాత్రతో పాటు, జనవాణి కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో విజయవంతం అవడంతో.. టిడిపికి పట్టున్న ప్రాంతాల పరిధిలో అభ్యర్థులు భరీలో ఉండేలా అడుగులు వేస్తూ ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఒకవైపు లోకేష్ యువగలం పాదయాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు లోకేష్ చేరుకునే లోపు పవన్ కల్యాణ్ రాయలసీమ వైపు వారాహి యాత్ర ముగించాలని భావిస్తున్నారు.ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి సీట్లు.. పోటీ చేసే అంశంలోనూ ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే పవన్ కల్యాణ్ నాలుగు విడతల్లో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలో యాత్ర చేపట్టిన నేపథ్యంలో రాయలసీమ జిల్లాల నుంచి చేపడిటే అటు లోకేష్, ఇటు పవన్ కల్యాణ్ చేపట్టిన రెండు యాత్రలతో ప్రజల్లోకి వెళ్ళడానికి సరైన సమయం అని ఇరు పార్టీల నేతలు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తూ 5విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ చేపట్టే 5విడత వారాహి యాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి అందరూ అంచనాలకు భిన్నంగా రాజకీయ అడుగులు వేసే పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే బోయే యాత్ర ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్