వర్మ సినిమా..ఇప్పటికి సేల్ కాని అపార్ట్‌మెంట్!
Varma cinema..an apartment that is not sold yet!ప్రస్తుతం టాలీవుడ్ లో హర్రర్ కామెడీ తీసే డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. అయితే, ఒకప్పుడు మాత్రం హర్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది మాత్రం రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు. అప్పట్లో ఆయన తీసిన ‘రాత్రి’ సినిమా సంచలనం రేపింది. ఈ సినిమాని చూడడానికి వచ్చిన ప్రేక్షకులను వణికించేసి చేసి, భయాందోళనతో థియేటర్ నుండి పారిపోయేలా చేసింది. దెయ్యం, భూత్, కౌన్, ఫూంక్, ఫూంక్-2 లాంటి భయంకరమైన చిత్రాలు తీసినందుకేమో వర్మని తమిళ అనువాద చిత్రం ‘డిమాంటి కాలనీ-2’కు సంబంధించిన తెలుగు ప్రమోషనల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పిలిచింది చిత్ర బృందం.
ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..ఒక ఆశ్చర్యకరమైన విషయం పంచుకున్నారు. అదేంటంటే? డిమాంటి కాలనీ సినిమా తీసినప్పుడు ఆ పేరుతో చెన్నైలో ఓ కాలనీ ఉండడంతో టైటిల్ విషయంలో ఇబ్బంది పడినట్లు తనకు చెప్పారని మరి ఈ సినిమా థియేటర్లో రిలీజయ్యాక ఆ కాలనీ వాళ్లంతా చెన్నై నుంచి వెళ్లిపోయారో లేదో తెలియదన్నాడు. కానీ, తాను ‘భూత్’ సినిమా ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్లో షూట్ చేశానని..ఆ తర్వాత ఆ అపార్ట్‌మెంట్ అంటే అందరికీ భయం పట్టుకుందని..తర్వాత ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదని వర్మ తెలిపాడు. ఇప్పటికీ ముంబయిలో ఆ అపార్ట్‌మెంట్ అమ్ముడవకుండా అలాగే ఉండిపోయిందని వర్మ వెల్లడించాడు.
భూత్ సినిమాను తీసిన ముంబయి అపార్ట్‌మెంట్ ను ఆరోజుల్లో ఇంటి యజమాని అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ అపార్ట్‌మెంట్ గురించి రకరకాల పుకార్లు షికార్లు కొట్టడంతో దాన్ని కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ముంబయిలోని ఆ అపార్ట్‌మెంట్ అమ్ముడు పోకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అని వర్మ ఈవెంట్ లో పంచుకున్నాడు




