పెద్దపల్లి టికెట్ కేటాయించే అవకాశాలు
జన్నారం, న్యూస్‌టుడే: పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది.
పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం ఆ పార్టీకి బలాన్నిచ్చే అంశం. ఆ స్థానాన్ని ఇప్పటికే గోమాసె శ్రీనివాస్‌కు కేటాయించిన భాజపా… కాంగ్రెస్ అభ్యర్థికి దీటైన వ్యక్తిని బరిలో నిలపాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్‌షా ఏర్పాటుచేసిన కమిటీలోని సభ్యులు వెంకటేశ్ నేత పేరును సూచించినట్లు తెలిసింది.
ఇప్పటికే నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయనకు చెప్పినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన 2019 భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆ పార్టీ టికెట్ కేటాయించలేదు. దీనిపై వెంకటేశ్‌నేత భాజపాలో చేరికపై త్వరలో స్పష్టత ఇస్తానన్నారు.