- Advertisement -
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు
Venkatrami Reddy, the leader of the Secretariat Employees Union, was arrested
విజయవాడ
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు అయ్యారు.
త్వరలో జరుగనున్న ఏపి సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెంకటరామిరెడ్డి వర్గం మందు, విందు పార్టీ ఏర్పాటు చేసింది. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేసారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి పలువురు ఉద్యోగులకు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి జరిపారు. వెంకట్రామిరెడ్డిని గురువారం అర్థరాత్రి అరెస్టు చేసారు.
- Advertisement -