కంటోన్మెంట్, అక్టోబర్ 28(వాయిస్ టుడే ప్రతినిధి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డ్ లోని ఇందిరమ్మ నగర్, పోచమ్మ టెంపుల్, బీరప్ప టెంపుల్ ఏరియా లలో 20వ వార్డ్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు మాదారపు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు వర్రీ తులసీరామ్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా వర్రీ తులసీరామ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బస్తీలోని ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీ ని గెలిపించాలని కోరడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు మమత, బిజెపి వార్డ్ ఉపాధ్యక్షురాలు రేఖ,ఓబీసీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జై యాదవ్ , బిజెపి వార్డ్ సెక్రటరీ శ్రీ హరి, ఓబీసీ మోర్చా నాయకులు లక్ష్మణ్,బిజేవైఎం అధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.



