- Advertisement -
ఈడీ విచారణకు హజరయిన విజయ్ సాయి రెడ్డి
Vijay Sai Reddy attended the ED investigation
హైదరాబాద్
కాకినాడ పోర్ట్ సెజ్ కేసులో నేడు ఈడి విచారణకు విజయ సాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ కి సంబంధించి అక్రమంగా షేర్ల బదలాయింపు వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి లో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈడీ గతంలో నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల కారణంగా విజయసాయిరెడ్డి హజరు కాలేదు. దీంతో సోమవారం విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయంలో ఈడి విచారణకు విజయ్ సాయి రెడ్డి హజరయ్యారు….
- Advertisement -