Thursday, April 24, 2025

త్వరలో వికసిత్ భారత్ – యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం.

- Advertisement -

త్వరలో వికసిత్ భారత్ – యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం.

Vikasit Bharat - Young Leaders Dialogue program coming soon.

మేరా యువభారత్ వేదికగా ప్రారంభం కాబోతున్న వికసిత భారత్ ఛాలెంజ్..

నవంబర్ 25 నుంచి డిజిటల్ క్విజ్

జిల్లా యువజన అధికారి అన్వేష్

జయశంకర్ భూపాలపల్లి,

యువత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త వేదికను ప్రారంభించింది.  2025 లో జరిగే నేషనల్ యూత్ ఫెస్టివల్ స్థానంలో  ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను ప్రారంభించనున్నారు. జాతీయాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్న ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా దీ నిని రూపొందించారు. ఈ  సందర్భగా నెహ్రు యువ కేంద్ర ఉమ్మడి జిల్లా అధికారి అన్వేష్ చింతల మాట్లాడుతు
2025 జనవరి 11, 12 తేదీల్లో జాతీయ యువజనోత్సవం (నేషనల్ యూత్ ఫెస్టివల్) సందర్భంగా వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జరుగుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఈ వారం మొదట్లో ప్రకటించినట్లు తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 3,000 మంది యువనేతల మధ్య ముఖాముఖి జరగనుంది.
వికసిత భారత్ ఛాలెంజ్ అనేది నాలుగంచెల పోటీ.  యువత ఇందులో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవచ్చు. యావత్ భారతదేశంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా లో 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు అఖిల భారత డిజిటల్ క్విజ్ పోటీలతో వికసిత భారత్ ఛాలెంజ్ మై భారత్ వెబ్సైట్లో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారంతా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. మేరా యువభారత్ (ఎంవై భారత్) వేదికగా జరిగే ఈ క్విజ్ లో భారత్ సాధించిన ప్రముఖ విజయాలపై వారి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ – నేషనల్ యూత్ ఫెస్టివల్, 2025కు సంబంధించిన అన్ని వివరాలూ మేరా యువభారత్ వెబ్ సైట్ (https://mybharat.gov.in/)లో అందుబాటులో ఉంటాయి.
వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రధాన లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. రెండు ప్రధాన లక్ష్యాల ఆధారంగా ఈ యేడు జరిగే కార్యక్రమానికి ప్రణాళికను రూపొందించినట్టు అన్వేష్ చింతల పేర్కొన్నారు. మొదటిది- రాజకీయాల్లోకి కొత్త యువనేతలను తీసుకురావడం. రాజకీయేతర నేపథ్యం ఉన్న లక్ష మంది యువతను ఈ రంగంలో భాగస్వాములను చేయాలని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా దీనిని చేపట్టబోతున్నారు. రెండోది- పారదర్శకమైన, ప్రజాస్వామిక, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానం ద్వారా వికసిత భారత్ కోసం యువత అర్థవంతమైన సహకారాన్ని అందించేలా చూడడం.
వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముఖ్య లక్ష్యాలను వివరిస్తూ.. “యువ ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం, వికసిత భారత్ కోసం వారి ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం” అని  చెప్పారు.
వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో పెద్ద సంఖ్యలో ఈనెల అనగా నవంబర్ 25 నుండి డిసెంబర్ 5 వరకు www.mybharat.gov.in నందు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా యువతకు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్