Sunday, February 9, 2025

ఐటీ హబ్ గా విశాఖ

- Advertisement -

ఐటీ హబ్ గా విశాఖ

Visakhapatnam as an IT hub

విశాఖపట్టణం, జనవరి 29, (వాయిస్ టుడే)
ఏపీని టెక్నాలజీ రంగంలోనూ ముందు వరుసలో నిలపాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం.. రాష్ట్రానికి అంతర్జాతీయ టెక్ సంస్థల్ని తీసుకురావాలని భావిస్తోంది. ఐటీ రంగంలో అగ్రగామి నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మోడళ్ ను అనుసరించి ఏపీలోనూ టెక్ రంగానికి సరికొత్త అవకాశాలు కల్పించాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐటీ సంస్థలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ఇప్పటికే దృష్టి పెట్టిన సర్కార్.. టెక్ సంస్థల కోసం ప్రత్యేక సిటీని నిర్మించాలని తలపెట్టింది. రానున్న రోజుల్లో టెక్ రంగంలో మంచి అభివృద్ధికి అవకాశం ఉన్న డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆవిష్కరణల కోసం ఒక హబ్‌ను ఏర్పాటు చేయాలనే భావిస్తోంది. ఇందుకోసం.. సముద్ర తీర పట్టణం విశాఖకు సమీపంలో ప్రతిష్టాత్మకమైన “డేటా సిటీ”ని నిర్మించాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల హామిలో మోజార్టీ ఉద్యోగాలను ఈ ప్రాజెక్టు ద్వారానే నెరవేర్చాలని భావిస్తోంది.విశాఖపట్నం సమీపంలోని మధురవాడలో 500 ఎకరాల్లో ఈ డేటా సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సిటీ కేంద్రంగానే.. ఐటీలోని విభిన్న కేటగిరీల్లో సేవలందించే ఐటీ సంస్థలకు స్థానం కల్పించనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. హైదరాబాద్ లో సైబర్ టవర్స్ ను నిర్మించారు. దాని కేంద్రంగా అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలకు ఆఫీస్ స్పేస్ కల్పించి.. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించగలిగారు. సరిగా.. ఇప్పుడు కూడా అలానే విశాఖలో ఐటీ సంస్థలకు భారీ స్థాయిలో ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి తీసుకువచ్చి, పెట్టుబడుల్ని ఆకర్షించనున్నారు. ఈ ఐటీ సిటీ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా ఉండాలనే ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే.. అంతర్జాతీయంగా అనేక దిగ్గజ టెక్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం సైతం భూ సేకరణకు కసరత్తు ప్రారంభించింది.ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాటిలో గూగుల్ ఒకటి. ఈ సంస్థ ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేసింది. ఆ సంస్థ భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుండగా, ఇందుకోసం 80 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అందించనుంది. అదే విధంగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 30 ఎకరాల్లో ఐటీ ప్రాంగణాన్ని నెలకొల్పనుండగా, ఇక్కడి నుంచి కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిందిదావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో జరిగిన కీలక చర్చల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించిన డేటా సిటీ కాన్సెప్ట్ ఊపందుకుంది. రాష్ట్రానికి డేటా సెంటర్లు, AI హబ్‌లను తీసుకురావడానికి లోకేశ్ టెమాసెక్ హోల్డింగ్స్, కాగ్నిజెంట్‌తో సహా ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపారు.ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు, అల్ డీప్ టెక్ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అందుకోసమే.. ఆయా సంస్థలకు మంచి వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం.. వైజాగ్ సమీపంలో ఐటీ సంస్థలన్నింటినీ కేంద్రీకృతం చేసేలా ప్రత్యేక ప్రాజెక్టు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్