Friday, February 7, 2025

రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047

- Advertisement -

రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047

Vision 2047 is for the future of tomorrow's generation

ఎన్నికలు జరిగేది 2029లోనే
సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి
మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టి గా మాట్లాడారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించా. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోంది. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు – వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలి. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయి. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలి. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 . సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తాం. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు. సమాధానాల రూపంలో నిర్వహిస్తాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతాం. సమయం సద్వినియోగం, మంత్రులు. అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అద్వానీ నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఆనాడు ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్