సియోల్ లో తెలంగాణ మంత్రుల పర్యటన
సియోల్
Visit of Telangana Ministers in Seoul
దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటించింది. బృందం లో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసి , మూసి రివర్ ప్రంట్ అధికారులు వున్నారు. నగరం లో మాపో లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించారు. సియోల్ నగరపాలక సంస్థ రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం WTE ( వెస్ట్ టూ ఎనర్జీ ) టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతున్నారు. ఇటువంటివి నగరం లో నాలుగు ప్లాంట్లను నిర్మిస్తున్నారు. విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది.