మనబడి – మన బాధ్యత కార్యక్రమంలో శ్రమదానం
గంగాధర, జూన్ 13: వాయిస్ టుడే
Voluntary labor (Shramadan) as part of the ‘Manabadi – Mana Badhyata’ (Our School – Our Responsibility) program.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టిన “మనబడి – మన బాధ్యత” (స్వచ్ఛ పాఠశాల) కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలంలోని కురిక్యాల, గంగాధర, బూరుగుపల్లి, ఘర్షకుర్తి, కొండాయపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులను శుభ్రపరిచారు.
కురిక్యాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ……….
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్లను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని, సర్వ శిక్షా అభియాన్, పీఎం శ్రీ పథకం ద్వారా కరీంనగర్ పార్లమెంట్ లోనీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గంగాధర మండల బీజేపీ అధ్యక్షుడు పంజాల ప్రశాంత్, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దూలం కళ్యాణ్, దళిత మోర్చా అధికార ప్రతినిధి మల్యాల వినయ్ సాగర్, మాజీ మండల అధ్యక్షుడు కోల అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీపతి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్ నారాయణ, ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గుండారపు మధు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సాదాల భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శులు రేండ్ల శ్రీనివాస్, తాళ్ల రాజశేఖర్, మండల ఉపాధ్యక్షుడు బొమ్మకంటి రాజిరెడ్డి, జిల్లా చేనేత సెల్ నాయకుడు రాజేంద్రప్రసాద్, జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ ఆకుల మనోహర్, దాసరి ఆంజనేయులు, వోడ్నాల రాజు, చిందం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు హాజరయ్యారు.




