ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం
ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కిరణ్ మాట్లాడుతూ
హుస్నాబాద్ నవంబర్ 22 (వాయిస్ టుడే ) ఈ నెల 30న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం ఈరోజు @ కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని@ గుండరెడ్డిపల్లి, బస్వాపూర్, పోరెడ్డిపల్లి, ఆరెపల్లి, గ్రామాలలో హుస్నాబాద్ సీఐ కిరణ్, కోహెడ ఎస్ఐ తిరుపతి, కేంద్ర బలగాలు ఎస్ఎస్బి (సశాస్త్ర సీమ బాల్ ) అధికారులు సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు, ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపినారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేద డయల్ 100 కాల్ చేయాలని చేసి సూచించారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగినది, పోలింగ్ జరిగే రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుంది, గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తికి ఓటు వేయండి కానీ ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని అడ్డుకున్న వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
ఎన్నికలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయాలని సూచించారు
సి విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు



