పేద విద్యార్థికి వాకర్స్ అసోసియేషన్ చేయూత
Walkers Association help poor student
పెద్ద మనసు చాటుకున్న రవీందర్ రావు, దాతలు
విద్యా దేవి వనంలో విరబూసిన వేద రాజర్షి
హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణం గాంధీనగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన తండ్రీ లేని కుమారి భానోతు వేద రాజర్షి తల్లి శ్రీదేవి, కుమార్తె వేద రాజర్షి అమ్మాయి కస్టపడి చదివి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నందు ఫ్రీ సీటు సంపాదించడం అభినందనీయం, కాని.. కనీసం ప్రభుత్వానికి కట్టే ఫీజూ, బుక్స్ కొనే తాహాతు కూడ లేని కారణంగా వచ్చిన సీటు చేజారిపోయే అవకాశం ఉందని ఆ విద్యార్థి బాధపడుతున్న తరుణంలో స్థానిక 29వ వార్డు మాజీ కౌన్సిలర్ ముక్క రమేష్ ఈ సమస్యను మానవతామూర్తులు అయిన హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు తెలపడంతో వారు హక్కున చేర్చుకుని మొత్తం ఫీజూ బుక్స్ కొరకు 25 వేలు అవసరం ఉంది కనుక వాకర్ సభ్యుల దృష్టి తీసుకువెళ్లారు. దీంతో సహృదయులు మానవతావాది మంచి మనసు గల వ్యక్తి అయిన వర్దినేని రవీందర్ రావు క్రషర్ యజమాని పెద్ద మనసు చేసుకొని, ఈ రోజు వాకింగ్ హైస్కూల్ మైదానంలో ఆప్పటికప్పుడు స్పందించి 8 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం వల్ల పలువురు ఆయనను అభినందించారు. అలాగే వాకర్ అధ్యక్షుడు గోవర్ధన్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఎం.డి. మతిన్ 2వేలు వేద రాజర్షికీ అందించారు. అలాగే ఐజెల్ అశోక్ 2000 రూపాయలు, డాక్టర్ నాగలింగం ₹1500, పలువురు వాకర్స్ సభ్యులు మరో 20 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆమె చదువుకు అవసరమైన 25 వేల రూపాయలను సమకూర్చి అందజేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
దయామయులు ఎవరైన దాతలు వుంటే పెద్దమనసు చేసుకొని ఆర్థిక సహాయం చేయాలని వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ బృందం విజ్ఞప్తి చేశారు.