దూకుడు పెంచిన ఎమ్మెల్యే నన్నపునేని
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో: వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 35వ డివిజన్ లో సందర్శనలో భాగంగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మరియు అన్ని శాఖల అధికారులతో కలిసి గణేష్ నగర్ కాలనీలో ముందుగా వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదనంతరం ఎదురుగానున్న డాన్ బాస్కో లోని పిల్లలకు పండ్లు పంచిపెట్టారు గణేష్ కాలనీ,పుప్పాల గుట్ట గల్లి గల్లి లో తిరిగిన ఎమ్మెల్యే నరేందర్ కు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ కాలనీలో ఉన్న సమస్యల పట్ల వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు వారి సమస్యలను అయినటువంటి సిసి రోడ్ డ్రైనేజీ,ఎలక్ట్రిసిటీ మరియు ఇతర వాటి గురించి ఎమ్మెల్యే నరేందర్ కు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ఇప్పటికే నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వాన నియోజకవర్గం నేడు 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మరియు అధికారులతో కలిసి డివిజన్లోని గణేష్ నగర్ కాలనీ పుప్పాలగుట్ట మరియు డివిజన్లోని అన్ని ప్రాంతాలను తిరిగి ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి వారికి ఏ మేర సహాయం చేస్తే వారు అభివృద్ధి చెందుతారు వారి కాలనీ అభివృద్ధికి ఏ విదంగా తోడ్పాటు కావాలి అనేది ప్రజల నుండి వారి స్పందన స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు
ప్రభుత్వం అందించే పథకాలైన పెన్షన్,గృహలక్ష్మి డబల్ బెడ్ రూమ్,బిసి బందు,దళిత బందు మరియు ఇతర పథకాలలో ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయనేది స్వయంగా తానే అడిగి తెలుసుకుని అధికారులకు తెలిపి నోట్ చేసుకుంటున్నారని తెలిపారు
ఎక్కడైతే ప్రజలకు మంచినీటి సమస్య డ్రైనేజీ రోడ్లు ఎలక్ట్రిసిటీ వాటన్నిటి తక్షణ పరిష్కారం చేయడం కోసం అధికారులతో కలిసి నేడు పర్యటిస్తున్నామని వాటి అన్నిటినీ నోట్ చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని తెలపడం జరుగుతుందన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రోల్ మాడల్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ తో పాటు డివిజన్ ముఖ్య నాయకులు,కాలనీ పెద్దలు,ముఖ్యులు, ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


